పెళ్లి గురించి అడిగిన నెటిజన్లకు దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన రష్మిక మందన్న..

ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘చలో ‘ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయం అయింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన రష్మిక ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా స్టార్ హీరోల సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు అన్ని సూపర్ హిట్ అవ్వడం తో ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లోకి చేరిపోయింది. ఇక పుష్ప సినిమా తో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. దాంతో ప్రస్తుతం సౌత్ లో కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీ లో బాగా బిజీ అయిపోయింది ఈ చిన్నది.

ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మూడునాలుగు సినిమా లు ఉన్నాయంటే నార్త్ లో రష్మిక ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ చెప్పనవసరం లేదు. ఇప్పటికే రెండు హిందీ సినిమా లో నటించి అక్కడి ప్రేక్షకులను అల్లరించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఆ రెండు సినిమా లు పెద్దగా విజయం సాధించలేకపోయ్యాయి. అయినా కూడా నార్త్ లో అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ సరసన ‘యానిమల్ ‘ లో నటిస్తుంది రష్మిక. అలానే షాహీద్ కపూర్ తో కలిసి నటించడానికి ఒక ప్రాజెక్ట్ కి ఓకే చెప్పిందట.

ఇక తెలుగు లో సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ కి జంటగా పుష్ప 2 సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా నితిన్ సరసన నటించడానికి ఒక ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక రష్మిక తాజాగా సోషల్ మీడియా లో అభిమానులతో ముచ్చట్టించింది. ఈ క్రమంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు రష్మిక ఓపిక గా సమాధానం చెప్పింది. నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా నుండి రష్మిక తప్పుకుంది అని వస్తున్న వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చింది. ఇంతలోనే ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్’ అని ఒక అభిమాని ప్రశ్నించగా ‘ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. దానికి చాలా సమయం ఉంది ‘ అని పెళ్లి గురించి ఒక క్లారిటీ ఇచ్చింది.