పవన్ కళ్యాణ్ ” OG ” లో బిగ్ బాస్ ముద్దుగుమ్మ.. ఎవ‌రంటే..!!

బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తాజాగా ప్రారంభమైన విషయం మనకి తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టగా.. అందులో శుభ శ్రీ రాయగురు ఒకటి. ఈ ముద్దుగుమ్మ హౌస్ లోకి వస్తూనే స్టేజ్ పై తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదు.. కానీ తెలివి మాత్రం ఉంది అంటూ క్యూట్ గా మాట్లాడుతూ మొదటి రోజే అభిమానులని ఆకట్టేసుకుంది.

అయితే ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నా” ఓజీ ” సినిమాలో నటించిందట. శుభ కు పవర్ స్టార్ అంటే చాలా ఇష్టమట. ‘ ఆయనతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాని ‘ ఆ సినిమాలో చాలా స్టైలిష్ గా ఎంటర్టైనర్ గా ఉందని తాజాగా చెప్పుకొచ్చింది.

ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హస్మీ ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడట. అమితాబచ్చన్ కూడా ఒక కీలక పాత్రలో వహిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ లాంటి ప్రామిసింగ్ యాక్టర్స్ సినిమాలో నటిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రోజు రోజుకి ఈ సినిమాపై హైప్‌ మరింత పెరుగుతుంది.