అన్న కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగం తెలిస్తే శభాష్ అనాల్సిందే..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు నందమూరి కుటుంబం నుంచి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హరికృష్ణ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా మంచి ప్రేక్షకాదరణ పొందగా కళ్యాణ్ రామ్ ఆడప దడప సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ బాగానే సక్సెస్ అవుతున్నారు. అయితే ఎప్పుడు కూడా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ చాలా ఆనందంగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు.

Jr NTR Praises His Half-Brother, Nandamuri Kalyan Ram's Performance In  Mythological Film 'Bimbisara'

కళ్యాణ్ రామ్ ఎక్కువగా సినిమాలు చేయకపోయినప్పటికీ తన బ్యానర్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తూ ఉంటారు. కొన్ని సినిమాలు కళ్యాణ్ రామ్ కు ఫ్లాపులు కాగా ఆర్థికంగా ఇబ్బందులలో కురుకుపోయారు. ఆ సమయంలోనే తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బ్యానర్ లో పలు సినిమాలు చేసి రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఆర్థికంగా తన అన్నను ఎన్టీఆర్ గట్టెక్కించారు. ఆ సమయంలో కళ్యాణ్ రామ్ ని కష్టాల నుంచి గట్టెక్కించిన సినిమాలలో పటాస్ సినిమా కూడా ఒకటి ఈ చిత్రాన్ని అనిల్ రావు పూడి దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాని స్వయంగా నిర్మించారు కళ్యాణ్ రామ్.. మొదట ఈ సినిమా కథ కళ్యాణ్ రామ్ కు వినిపించక బాగా నచ్చిందట..అయితే తన బ్యానర్లో స్టార్ హీరోతో ఈ సినిమా చేస్తే బాగుంటుందని కళ్యాణ్ రామ్ అభిప్రాయంగా తెలియజేశారట .అలాగే అనిల్ కూడా ఎన్టీఆర్ కు కథ చెప్పగా ఎన్టీఆర్ కు బాగా నచ్చడంతో ఎన్టీఆర్ మాత్రం కేవలం కళ్యాణ్ రామ్ మాత్రమే చేస్తే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని తెలియజేశారట.. అందుచేతనే కళ్యాణ్ రామ్ ని ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా పెట్టి సినిమా చేసి సక్సెస్ అందుకున్నారు. కథ నచ్చిన కూడా తన అన్న కోసం ఎన్టీఆర్ ఈ సినిమా కథని త్యాగం చేశారు.