నితిన్ సినిమా హౌస్ ఫుల్ పవన్ కళ్యాణ్ మూవీకి ప్లస్ అయ్యింది.. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?

నితిన్ – పవన్ వీరిద్దరి పేర్లు కలిపి వినగానే పవన ఫ్యాన్స్‌లో ఓ చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి నితిన్ కూడా డైహార్ట్ ఫ్యాన్.. అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటిది నితిన్ సినిమా హౌస్ ఫుల్ అయితే పవన్ కళ్యాణ్ సినిమాకు ప్లస్ అవడం ఏంటి.. ఇంతకీ ఏంటా సినిమా.. అనుకుంటున్నారా. అసలు విషయంకి వేస్తే 2004 సెప్టెంబర్ నెలలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ గుడుంబా శంకర్ ‘, నితిన్ నటించిన ‘ సై ‘ రెండు సినిమాలు వెంటవెంటనే రిలీజ్ అయ్యాయి.

 

‘ గుడుంబా శంకర్ ‘ సినిమాకు వీర శంకర్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 13 రిలీజ్ అయిన సినిమా మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వల్ల 4 వారాల వరకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ సాధించింది. అయితే తర్వాత నితిన్ హీరోగా ఎస్. ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందిన ‘ సై ‘ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఈ సినిమా పై ఎటువంటి అంచనాలు లేకపోయినా రిలీజ్ అయిన ఫస్ట్ షో తోనే సూపర్ హిట్ టాక్‌ సొంతం చేసుకుంది.

వీకెండ్ హౌస్ ఫుల్ కలెక్షన్లతో దుమ్మురేపింది. అదే టైంలో ఆ సినిమాకు టికెట్లు దొరకని వాళ్లంతా పక్కన థియేటర్స్ లో ఉండే గుడుంబా శంకర్ సినిమాకు వెళ్లడంతో పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమాకు కూడా ఇది ప్లస్ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్ ముందు రోజు వరకు కూడా డల్ గా ఉన్న గుడుంబా శంకర్ కలెక్షన్లు నితిన్ సై సినిమా వల్లే పెరగాయి. ఆ వీకెండ్ గుడుంబా శంకర్ ఓకే అనిపించే కలెక్షన్స్ తో రన్ ముగించింది.