ఉల్టా ప‌ల్టా అంటే ఇదేనేమో.. బిగ్‌బాస్ 7లో లీకైన టాప్ 5 కంటిస్టేంట్స్‌ అగ్రిమెంట్.. అంతా ముందే పిక్స్..!!

బిగ్‌బాస్ సీజన్ 7 ఉల్టా పల్టా అన్నట్లుగానే మంచి రసవాత్రంగా కొనసాగుతుంది. ఈ సీజన్ ఎవరు ఊహించలేని విధంగా ట్విస్ట్ల‌తో, ప్లాన్లతో బిగ్ బాస్ అమలుపరిచాడు బిగ్ బాస్. ఇక తాజా లైవ్ ఎపిసోడ్ లో టేస్టీ తేజ సీరియల్ యాక్టర్ అమ‌ర్ దీప్ కలిసి మాట్లాడుకున్న విధానం టాప్ పై కంటెస్టెంట్ ల గురించే మాట్లాడినట్లుగా అనిపించింది. టేస్టీ తేజ మాట్లాడుతూ ఈ వీకైతే గట్టిగా ఆడతాను.. లాస్ట్ వీక్ రెడ్డి ఇచ్చారు.. ఈ వారం ఏమిస్తారో చూడాలి అంటూ అమర్ తో అన్నాడు.

మళ్ళీ తేజానే మాట్లాడుతూ అవన్నీ పక్కన పెట్టుకాని నీకు టాప్ అగ్రిమెంట్ ఉందట కదా నిజమేనా అనే విధంగా సైగలు చేశాడు. టేస్టీ తేజ చేసిన సైగలు అది టాప్ ఫైవ్ అన్నాడా..? లేదంటే ఐదు వారాలు అగ్రిమెంట్ అన్నాడా..? క్లారిటీగా తెలియదు కానీ 5 అనేది మాత్రం స్పష్టంగా కనిపించింది. లైవ్ ఎపిసోడ్లో టేస్టీ తేజ ఈ మేటర్ లీక్ చేయడంతో అమర్ కెమెరాల వైపు చూస్తూ ఏదో చెప్పాడు. అయితే దాన్ని లైవ్ ఎపిసోడ్ నుంచి సడన్ గా కట్ చేసేసారు. దీంతో హౌస్‌లో ఏదో జరుగుతుందన్న ఆసక్తి ప్రేక్ష‌కుల‌లో మరింతగా పెరిగింది.

 

ఇక ఆమర్‌కి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. కానీ తను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నేను ఈ వారం ఉంటానా లేదా.. అంటున్నాడు. ఇక అమర్దీప్ ఇలా అనడంపై ప్రేక్షకుల్లో కొన్ని సందేహాలు మొదలయ్యాయి. నిజంగానే ఇతనికి టాప్‌ కంటెస్టెంట్‌గా అగ్రిమెంట్ వచ్చిందేమో..? మొత్తం పిక్స్ చేసుకున్న తర్వాతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాడేమో..? అన్న సందేహాలు మొదలయ్యాయి. కావాలని డైవర్ట్ చేయడానికి ఈ వారం ఉంటానో లేదో అన్నట్లుగా మాట్లాడుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.