సాయి పల్లవి కి పెళ్లి అయిపోయిందా.. ఫొటోస్ వైరల్..!!

టాలీవుడ్ లో నాచురల్ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ సాయి పల్లవి.. తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. మొదట డ్యాన్స్ డీ షో ద్వారా కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఆ తర్వాత తన టాలెంట్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించింది.

സായി പല്ലവിയുടെ 'രഹസ്യ വിവാഹം'; വാര്‍ത്തയ്ക്ക് പിന്നിലെ സത്യം ​| Sai Pallavi  Wedding Fake

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ క్రేజీ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. గత రెండేళ్లుగా సాయి పల్లవి ఎలాంటి సినిమాలలో నటించలేదు. ఇటీవల శివ కార్తికేయన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇప్పుడు తాజాగా సాయి పల్లవికి వివాహం అయ్యిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .ఈ విషయం విని ఒక్కసారిగా అభిమానులు షాక్కు గురవుతున్నారు. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఒక వ్యక్తి అతని పక్కనే ఉన్న సాయి పల్లవి ఫోటోలలో దండలతో పక్కపక్కనే ఉన్న ఫోటో కారణంగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే సాయి పల్లవి పెళ్లిపై వైరల్ అవుతున్న న్యూస్ పై టాలీవుడ్ డైరెక్టర్ వేణు బుడుగుల క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది శివ కార్తికేయన్ కొత్త సినిమా పూజా కార్యక్రమంలో తీసిన ఫోటో అని ఈ సినిమా పూజ సందర్భంగా ఇలా విధి ఇద్దరు పక్కపక్కన ఉండడంతో కొంతమంది చాలా తప్పుగా భావిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.. ఈ పోస్టుతో సాయి పల్లవి పెళ్ళి జరగలేదని క్లియర్ గా క్లారిటీ ఇచ్చి వైరల్ అవుతున్న న్యూస్ కొట్టి పారేశారు డైరెక్టర్ వేణు.