గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఐ మూవీ హీరోయిన్.. ఇలా అయిపోయింది ఏంటి..?

అమీ జాక్సన్ విక్రమ్ ఐ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ ఎవడు, రోబో 2.0 సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బిజినెస్ మ్యాన్ జాడును ప్రేమించి పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. కానీ ఈ ప్రేమ పెళ్లిదాకా రాకుండానే ముగిసిపోయింది. గతేడాది నుంచి అడ్ వెస్ట్‌వీక్‌తో పీకల్లోతు ప్రేమలో ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ మిషన్ చాప్టర్ 1 అచ్చమ్ ఎంబ‌తు ఇల‌యే అనే తమిళ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమీ జాక్సన్ ఈమధ్య గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తాజాగా ఆమె ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అసలు ఆమె అమీ జాక్సనేనా..? అసలు అలా లేనే లేదే..? ఏంటి ఇలా మారిపోయింది..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన హాలీవుడ్ మూవీ ఓపెన్ హైమర్ లోని యాక్టర్ సిలియన్ మార్ఫిల్‌లా ఉందంటూ ఏదైనా వ్యాధితో బాధపడుతుందా..? లేదంటే సర్జరీ చేయించుకుందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈమె పిక్స్ పై ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. ఐ సినిమాలో విక్రమ్‌ తనను మోసం చేసిన అందరి మీద ప్రతీకారం తీర్చుకున్నాడు ఇన్నాళ్లకు హీరోయిన్ పై కూడా రివెంజ్ తీసుకున్నాడా ఏంటి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఏదైనా అమీ జాక్సన్ ఎంతో అందంగా చిరునవ్వు చిందిస్తూ కనిపించగా ఇప్పుడు ఆ అందం లేకుండా పోయింది అంటూ టాక్‌.