హర్ట్ అయిన ఎన్టీఆర్ అభిమాని.. ఎమోషనల్ నోట్ వైరల్..!!

టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. నందమూరి కుటుంబంతో కలిసి ఈ మధ్యకాలంలో చాలా రేర్ గా కనిపిస్తున్నారు ఎన్టీఆర్.. అయితే నందమూరి కుటుంబంతో కనిపిస్తే మాత్రం ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతూ ఉంటారు. హీరోగా స్టార్ రేంజ్కి ఎదిగిన ఎన్టీఆర్ ని నందమూరి కుటుంబం మాత్రం పెద్దగా. హరికృష్ణ మరణం తర్వాత కళ్యాణ్ రామ్ తో బాగ కలిసిపోయారు.

ఈ మధ్యనే సీనియర్ ఎన్టీఆర్ 100 ఇయర్ సెలబ్రెటీని పట్టించుకోని ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబు అరెస్టు పైన కూడా నోరు విప్పడం లేదు.. దీంతో పలువురు నందమూరి అభిమానులు ఎన్టీఆర్ ని పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఎన్టీఆర్ అభిమానులమని చెప్పుకోలేకపోతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. చాలామంది మాత్రం ఎన్టీఆర్కు సపోర్టుగా చేస్తూ ఇదివరకు ఎన్టీఆర్ ని పట్టించుకోని వారు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే ఖాజాగా ఒక అభిమాని ఒక ప్రశ్న ఒకటి విడుదల చేయడం జరిగింది.

RRR Star Jr NTR Gets Trolled Yet Again For His 'American Accent' By  Netizens On Social Media, One Says “Accent Is Delightful, But Awkward..."

మా వాడివే కానీ మాలో ఒక్కడివి కాలేవు..@tarak 9999 అంటూ ఒక నోట్ ని సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. ఇక ఆ నోట్ లో ఇలా రాసుకోస్తూ..”గతంలో నిన్ను ప్రాణంలా ప్రేమించి ఒక అభిమానిని ఇప్పుడు కేవలం నందమూరి కుటుంబ సభ్యుడిగా మాత్రమే నిన్ను గౌరవిస్తాము వాడెవడో కొత్తగా వచ్చి సపోర్ట్ చేశాడని లేదా నీ అవసరం మాకు లేదని నిన్ను వదిలేయలేదు.. నిన్ను అభిమానించడం కూడా మానలేదు మా హరన్నలో ఉన్న తెగింపు మా రామన్న లో ఉన్న ఆవేశం మా బాలయ్యలో ఉన్న ధైర్యం నీలో కనిపించలేదు.. నీలో ఉన్న ఆ మొండితరం మేము భరించలేకపోతున్నాము నీ మౌనం సహించలేక ఉన్నాము నీ మీద ప్రేమ అని నాకు నేనుగా చంపుకున్నాను సగటు సిని ప్రేమికుడుగా నీ సినిమాలు మాత్రమే చూస్తాను సంతోషంగా ఉంది థాంక్యూ నమస్తే అంటూ ఒక లెటర్ ను రాశారు.