పెళ్లిపై నెటిజన్ కు దిమ్మతిరిగే ఆన్సర్ చెప్పిన హీరోయిన్ మాధవిలత..!!

టాలీవుడ్ లోకి మొదట నచ్చావులే సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ మాధవి లత.. ఈ సినిమా 2008లో విడుదలై మంచి సక్సెస్ను అందుకుంది .ఆ తర్వాత స్నేహితుడా, అరవింద-2 లాంటి చిత్రాలలో మాత్రమే నటించింది.మహేష్ బాబు వచ్చిన అతిధి సినిమాలో హీరోయిన్స్ స్నేహితురాలుగా మొదటిసారిగా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం రాజకీయాలలో చురుకుగా ఉంటున్న ఇమే సోషల్ మీడియాలో నిత్యం ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటూ ఏదో ఒక విషయంపై స్పందిస్తూ ఉంటుంది.

Madhavi Latha - IMDb

అయితే ఇప్పటివరకు మాధవి లత వివాహం చేసుకోలేదు.. దీంతో ఆమె పెళ్లి గురించి పలువురు నెటిజెన్స్ పలు రకాలుగా ప్రశ్నించడం జరిగింది. అయితే ఆమె షేర్ చేసిన వీడియోలో పెళ్లి గురించి ప్రస్తావన తీసుకురావడం జరిగింది.. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైన స్టైల్ లో కౌంటర్ ఇవ్వడం జరిగింది మాధవి లత.. ఫేస్బుక్లో ఒక నెటిజన్ చేసిన కామెంట్స్ కు బాధపడిన మాధవి లత తన పెళ్లి గురించి ఇలా మాట్లాడింది.. పెళ్లి చేసుకోకపోతే ఈ భూమి మీద బతికే అర్హత లేదా..పెళ్లి చేసుకొని వాళ్లకు నిజంగానే బలుపు ఉంటుందా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంటే వెంటనే మంచిగా అవుతానా ..మీ మాటలు చూస్తే పెళ్లి చేసుకో లేదంటే నాకు ఆత్మ అభిమానం ఉన్నట్టే కదా మరి మీరు ఎలా ఉన్నారు అంటే..

వివాహం చేసుకొని వారంతా సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలా.. పీఎం మోది,యూపీ సీఎం యోగి, అబ్దుల్ కలాం, వివేకానంద వీరంతా గొప్పవాళ్ళు అయ్యారు కదా అయితే నాకు పెళ్ళికానందువల్ల మీరంతా ఫీలవుతున్నారా అయితే మీరే నాకు పెళ్లి చేయండి అంటూ ఒక ఫన్నీ వీడియో ని షేర్ చేసింది. దీంతో పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.