మార్క్ ఆంటోని రివ్యూ.. విశాల్ సక్సెస్ కొట్టినట్టేనా..?

కోలీవుడ్ హీరో విశాల్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. హీరో విశాల్ కు సరైన సక్సెస్ రాక ఇప్పటికీ చాలాకాలం అవుతోంది. తాజాగా ఎస్ జె సూర్య, విశాల్ ,సునీల్ ,రీతు వర్మ కాంబినేషన్లో వచ్చిన టైం ట్రావెల్ కథ మార్క్ ఆంటోనీ.. ఈ సినిమా ట్రైలర్ టీజర్ కాస్త ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించాయి. దీంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడింది. విశాల్ క్రేజ్ తో ఈ సినిమా బిజినెస్ కూడా భారీగానే జరిగినట్టు తెలుస్తోంది. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది మరి ఏ విధంగా ప్రేక్షకులను మెప్పించారు తెలుసుకుందాం.

Mark Antony First Look Out! Vishal Krishna's Upcoming Film's Poster  Revealed on His Birthday (View Pic) | 🎥 LatestLY

మార్కు ఆంటోనీ సినిమా మొదట విజయ్ దళపతి కి స్పెషల్ థాంక్స్ తెలియజేస్తూ ప్రారంభించారు..దీంతో దళపతి ఫ్యాన్స్ కూడా ఖుషి అయ్యారు. ఈ సినిమా ఎండింగ్లో కూడా అజిత్ కు స్పెషల్ థాంక్స్ కూడా చెప్పారట విజయ్, అజిత్ అభిమానులు ఈ సినిమా మాట్లాడుకునే విధంగా ప్లాన్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమా మొత్తం ఎస్ జె..సూర్య కామెడీ సన్నివేశాలు హైలెట్ గా ఉన్నాయని ఒంటి చేత్తో ఈ సినిమాని ముందుకు తీసుకువెళ్లారని సినిమా బాగుందని పలువురు నెట్టిజెన్స్ సైతం తెలుపుతున్నారు.

విశాల్ యాక్షన్ ఎస్ జె సూర్య కామెడీ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తున్నాయని కార్తీ వాయిస్ తో ఇంట్రడక్షన్ చేశారట. కొంతమంది ఈ సినిమా చూసి రూ .100 కోట్ల సినిమా అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు సంబంధించి పూర్తి రివ్యూ రావాలి అంటే మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే.. ఎన్నో ఏళ్ల తర్వాత విశాల్ ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ కొట్టినట్టే అన్నట్లుగా అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అధిక రవిచంద్రన్ తెరకెక్కించారు.