డ్రగ్స్ కేసు పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో నవదీప్..!!

తెలుగు ఇండస్ట్రీలో మరొకసారి ఇప్పుడు డ్రగ్స్ కలకలం రేపుతోంది.. తాజాగా హైదరాబాదులో మాదాపూర్ డ్రగ్స్ కేసు విషయంలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..ఈ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్ పేరు కూడా మరొకసారి వార్తలలో నిలుస్తోంది. నవదీప్ కు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లుగా సిపిసిఐ ఆనంద్ తెలియజేయడం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే గత కొన్నేళ్ల క్రితం మాదాపూర్ డ్రగ్స్ కేసు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ కేసులో చాలామంది పోలీసులు అధికారులతో పాటు ఇన్ ఫార్మర్లు కూడా ప్రశ్నించారు.. అప్పట్లో ఈ విషయం పెద్ద దుమారాన్ని రేపింది. అయితే ఈ విషయంపై కొంతమంది పరారీలో ఉన్నట్లుగా తెలియజేశారు. మరి కొంతమంది ఫ్యామిలీతో సహా పరారీలో ఉన్నారని మొబైల్స్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయని తెలిపారు అధికారులు.. ఇలాంటి వారిలో మేఘన సినిమా డైరెక్టర్, ఇంద్ర తేజ్, నవదీప్, శ్వేత ,కార్తీక్ ఇలా పలువురు పరారీలో ఉన్నారని కూడా తెలియజేశారు. అయితే ఈ పేర్లలో సోషల్ మీడియాలో హీరో నవదీప్ పేరు హైలెట్ గా మారుతోంది.

నవదీప్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వ్యవహారం పైన క్లారిటీ ఇచ్చారు.. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఎలాంటి నిజము లేదని నేను హైదరాబాదులో ఉన్నానని స్పష్టత ఇచ్చారు డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా తెలిపారు..ఇకపోతే నవదీప్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు.. 2021లో మోసగాళ్లు అనే సినిమాలో కనిపించారు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు సమాచారం.