ఈ ఫోటోలో ఉన్న క్యూటీ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. టాలీవుడ్ లో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్‌!

పైన ఫోటోలో డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపిస్తున్న క్యూటీ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? టాలీవుడ్ లో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్‌. మూడు సినిమాల‌కు స్టార్ అయిపోయింది. యూత్ లో య‌మా క్రేజ్ సంపాదించుకుంది. ఎవ‌రో గెస్ చేశారా.. ఆమె ఎవ‌రో కాదు కేర‌ళ కుట్టి సంయుక్త మీన‌న్. పాలక్కడ్‌లో జన్మించిన సంయుక్త మీన‌న్‌.. పాప్‌కార్న్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

ఆ త‌ర్వాత మ‌ల‌యాళంతో పాటు తమిళ్, కన్నడ భాష‌ల్లో అనేక సినిమాలు చేసింది. న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. గ‌త ఏడాది విడుద‌లైన భీమ్లా నాయక్ మూవీతో తొలిసారి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఇందులో రానాకు భార్యగా ప్రెగ్నెంట్ లేడీ పాత్ర‌లో అంద‌రినీ అల‌రించింది. ఆ త‌ర్వాత బింబిసార‌, సార్ సినిమాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది.

ఇటీవ‌ల బింబిసార మూవీతో అంద‌రినీ భ‌య‌పెట్టి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగులో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ తో `డెవిల్‌` అనే మూవీ చేస్తోంది. అలాగే నిఖిల్ హీరోగా తెర‌కెక్కుతున్న `స్వయంభూ` మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. మ‌రోవైపు మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లోనూ సంయుక్త పలు ప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ అయింది. అన్న‌ట్లు నేడు సంయుక్త బ‌ర్త్‌డే. దీంతో అభిమానులు, సినీ తార‌లు సోష‌ల్ మీడియా ద్వారా ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. ఆమె న‌టిస్తున్న సినిమాల నుంచి బ‌ర్త్‌డే పోస్ట‌ర్స్ రిలీజ్ అవుతున్నాయి. ఇక బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సంయుక్త చైల్డ్ హుడ్ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Samyuktha (@iamsamyuktha_)