ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న జనీలియా..!

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ బ్యూటీ జెనీలియా.. బొమ్మరిల్లు సినిమాతో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. హ హ హ‌సినీగా కుర్ర కారు ఎదలో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలతో నటించి మంచి హిట్ సినిమాల‌ను అందుకుంది. ఇక కెరీర్ పిక్స్‌లో ఉన్న టైంలో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్‌ని వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ బాధ్యతలను తీసుకుని హౌస్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది.

జెనీలియాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక వారు ప్రస్తుతం స్కూల్ కి వెళుతున్నారు. దాంతో కొంత గ్యాప్ తర్వాత ఈ చిన్నది ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సూపర్ హిట్గా నిలిచిన మజిలీ సినిమాను వేద్ అనే పేరుతో జెనీలియా, రితేష్ కలిసి నటించి హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాకు వీరే ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. ఇక ఈ సినిమా తర్వాత జెనీలియాకు చాలా అవకాశాలే వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో జెనీలియా మరోసారి ప్రెగ్నెంట్ అయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం జెనీలియా బేబీ బంప్‌తో బయటకు రావడమే.

ఇటీవ‌ల‌ ముంబైలో జెనీలియా, రితేష్ ఒక ప్రైవేటు ఈవెంట్లో సందడి చేశారు. ఈ ఈవెంట్ కు జనీలియా వైలెట్ కలర్ మినీ ప్రాక్ లో హాజరై సందడి చేసింది. ఇక ఈ ఫ్రాక్‌లో ఆమె బేబీ బంప్‌ క్లియర్‌గా కనిపిస్తుంది. దీంతో ఆమెను చూసిన అభిమానులు జెనీలియా మరోసారి ప్రెగ్నెంట్ అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది కంగ్రాట్స్ అంటూ విషెస్ తెలియజేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో జెనీలియా స్పందిస్తే గాని తెలియదు.