పవన్ పై వర్మ పంచ్.. మామూలుగా లేదుగా..!

టైమ్‌ చూసి కౌంటర్లు వేయాలంటే రామ్‌గోపాల్ వర్మ ఫస్ట్ ఉంటాడు. ఆయన టైమింగ్ మరొకరికి రాదు. పవన్ కళ్యాణ్ పై పంచులు వేయడం వర్మకి ఇదేం కొత్త కాదు. పవన్ పై ఆయన ఏకంగా ఓ సినిమానే తీసి రిలీజ్ చేశాడు. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ పై తనదైన స్టైల్ లో కౌంటర్లు వేస్తూ హైలైట్ అవుతున్నాడు ఆర్జీవి. చంద్రబాబు అరెస్ట్‌తో పవన్ కళ్యాణ్ రోడ్ ఎక్కిన సంగతి తెలిసిందే. పోలీసులు నిలువరిస్తే రోడ్డుపైనే పడుకున్నాడు. ఆ తర్వాత రోడ్డుపైన కూర్చుని పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ అంశంపై వర్మ తన ట్విట్టర్ వేదిక స్పందించాడు.

పవన్ మంటిలిటిని నాకంటే ఎవరూ బాగా అర్థం చేసుకోలేరు అంటూ ట్విట్ చేసిన ఆర్జీవి.. తను రూపొందిస్తున్న వ్యూహం సినిమాలో పవన్ పాత్రధారి కి చెందిన ఫోటోలు పోస్ట్ చేశాడు. నెలరోజులు కిందట పవన్ పాత్రధారిపై తను ఎలాంటి ఫోజులని చిత్రీకరించాడో అదే ఫోజులను పవన్ కళ్యాణ్ తననిజ‌ జీవితంలో ఇచ్చాడంటూ వర్మ ఆ ఫొటోస్ ని ట్యాగ్ చేశాడు. ఈ సందర్భంగా వ్యూహం సినిమాలో ప‌వ‌న్ పాత్ర‌ధారి ఇచ్చిన‌ స్టిల్స్ రియల్ లైఫ్ లో పవన్ కళ్యాణ్ ఫోటోలు సరిపోల్చాడు. వర్మ చెప్పినట్లుగానే నిజంగానే సినిమాలో స్టిల్స్ లాగా అచ్చుగుద్దినట్లుగా పవన్ కళ్యాణ్ స్టిల్స్ ఉన్నాయి.

సినిమాలో పవన్ పాత్ర ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ సినిమాలో పవన్ మ్యాన‌రిజం మాత్రం ఆర్‌జీవి అచ్చుగుద్దినట్లు తీస్తాడు. ఈ సందర్భంగా చంద్రబాబుపై కూడా వర్మ పంచ్‌లేశాడు. వివాహం అనే జైలు జీవితం నుంచి నిజమైన జైలుకు చంద్రబాబు వెళ్ళాడని.. అది కూడా తన పెళ్లి రోజునాడు ఇలా జరగడం మంచి విషయం అంటూ చెప్పుకొచ్చాడు. దీన్ని క‌ర్మ సిద్దాంతం అంటారు అంటూ ట్విట్ చేశాడు. ప్రస్తుతం వర్మ పోస్ట్ వైరల్ అవడంతో టీడీపీ అభిమానులతో పాటు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా వర్మను బండ బూతులతో ఆడుకుంటున్నారు.