నా పుట్టుకే ఓ అద్భుతం.. అమ్మ కడుపులోనే చచ్చి బ్ర‌తికా..శిల్ప శెట్టి

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి తెలియని వారు ఉండరు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఈ బ్యూటీ ఇటీవల సుఖీ మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కుశ కపిల్, దిల్నాజ్ ఇరాని, అమిత్ సాద్, చైతన్య చౌదరి కీరోల్‌లో నటించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 22న రిలీజ్ కానుంది. ఇక ఇటీవ‌ల‌ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న శిల్పా శెట్టి మాట్లాడుతూ తన పుట్టుకను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయింది.

ఆమె మాట్లాడుతూ నేను అనుకోకుండా ఈ భూమి మీద అడుగు పెట్టాను.. నేను అమ్మ క‌డుపులో చచ్చి పుట్టాను. కడుపులో పడ్డపడి నుంచి మా అమ్మ నిరంతరం అధిక రక్తస్రావంతో ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. తీవ్రంగా ఇబ్బందులు పడింది. దీంతో వైద్యులు కూడా ఆమెకు అబార్షన్ చేయించుకోవాలని సజెషన్ ఇచ్చారు. నన్ను కోల్పోతున్నాననే బాధతో ఆమె ఎంతో ఒత్తిడికి గురైంది. కానీ ఆ దేవుడి దయవల్ల నేను భూమిపై పడ్డాను అంటు వివ‌రించింది.

మా అమ్మ ఎప్పుడు నాకు ఒకటి చెబుతూ ఉంటుంది. నీవు ఏదో పని చేయడానికి ఇంకా బ్రతికి ఉన్నాపు. నువ్వు ఇక్కడికి రావడానికి ఏదో బలమైన కారణం ఉంటుందని ఆమె అంటూ ఉంటుంది అని ఎమోషనల్ అయింది శిల్పా. ఇక ఇటీవల ఆమె నటించినా సుఖి మూవీ సోనాలి జోషి దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమాను వీక్షించ‌డానికి బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.