బాలయ్యకు జోడిగా పాన్ ఇండియా హీరోయిన్..!!

నందమూరి బాలయ్య ఈ ఏడాది వీర సింహారెడ్డి చిత్రంతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియోస్ని సైతం బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే చిత్రంలో నటిస్తున్నారు.. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా శ్రీ లీల బాలయ్య కూతురీ పాత్రలో కనిపించబోతోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సైతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తున్నాయి.

Balayya and Bobby are ready to Roar?

ఈ సినిమా తరువాత బాలయ్య డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక ప్రాజెక్టులో నటించబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారుతోంది.. అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో హీరోయిన్ గా కేజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటిలాగానే యాక్షన్ డ్రామా కాకుండా డైరెక్టర్ బాబి ఈసారి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో ఎమోషనల్ గా సాగే స్టోరీ తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

KGF Chapter 2: When Former 'Miss Supranational' Srinidhi Shetty Rejected As  Many As 7 Films To Be Part Of Yash Starrer!

అలాగే ఇందులో పొలిటికల్ నేపథ్యం కలిగిన బ్యాక్ డ్రాప్ కూడా ఉండబోతుందని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు.శ్రీనిధి శెట్టి విషయానికి వస్తే 2015లో మిస్ కర్ణాటక మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిల్ ని అందుకోవడం జరిగింది. 2018లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజిఎఫ్ సినిమాతో ఎంట్రి ఇచ్చి పాన్ ఇండియన్ హీరోయిన్ గా మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తరువాత విక్రమ్ తో కోబ్రా సినిమా నటించిన పర్వాలేదు అనుకుంది. మరి బాలయ్య సినిమాలు అవకాశం వచ్చినట్లు అయితే ఈమె కెరియర్ మారుతుందేమో చూడాలి మరి.