” దేవర ” స్టోరీ పై అది అబద్ధం.. అసలు నిజం ఏంటంటే..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ” సలార్ “. ఆర్ఆర్ఆర్ లాంటి గ్రాండ్ సక్సెస్ అనంతరం తారక్ చేస్తున్న మొదటి సినిమా ఇది కావడంతో ఈ మూవీ పై సెన్సేషనల్ హైప్‌ నెలకొంది.

ఇక ఈ సినిమా కోసం కొరటాల ఓ పవర్ ఫుల్ కథని రాసుకున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఇది వరకే కొన్ని థియరీలు కూడా వచ్చాయి. అంతే కాకుండా కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా కూడా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు అని రూమర్స్ ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా మరో వెర్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ ఐఎండిబిలో అయితే దేవర లైన్ వైరల్‌గా మారింది. ఇది అసలు సినిమాకి సంబంధం లేనిది అని తెలుస్తుంది. దీనితో ఆ లైన్‌ని వారు అప్రమత్తం అయ్యి వెంటనే తీసేసారు కూడా. దీంతో ఈ కథ అబద్ధం అని చెప్పాలి.