రెబల్ స్టార్ ప్రభాస్ కి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..?

ప్రభాస్ మంచి ఫుడ్డీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని రాజమౌళి కూడా చాలాసార్లు చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి చీట్ మిల్ ప్రోగ్రాంలో కూర్చుంటే 20 నుంచి 25 వెరైటీలు కూడా లాగించేస్తాడంటూ అంటూ రాజమౌళి గతంలో వివరించాడు. మరి ఇన్ని వెరైటీలు తినే ప్రభాస్ ఇష్టమైన వంటకం ఏంటి అనే అంశం మాత్రం ఇప్పటివరకు చాలామందికి తెలియదు. మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తుంది అనుష్క శెట్టి. ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా ప్రమోషన్ల కోసం రెసిపీ ఛాలెంజ్ ప్రవేశపెట్టింది. ముందుగా అనుష్క తనకు ఇష్టమైన వంటకాన్ని చెప్పి దాన్ని ఎలా వండాలో వివరించింది. అదే టైంలో ప్రభాస్ కి కూడా రెసిపీ ఛాలెంజ్ విసిరింది. ఈ సందర్భంగా ప్రభాస్ స్పందిస్తూ తనకు ఇష్టమైన వంటకాన్ని బయటపెట్టాడు. అది ఎలా చేయాలనే అంశాన్ని కూడా వివరించాడు. స్వీటీ నాకు దశాబ్దాలుగా తెలుసు కానీ తనకు ఇష్టమైన రెసిపీ ఏంటో నాకు ఇప్పటివరకు తెలియదు. ఇన్నాళ్లకు దీంతో తెలిసింది. నాకు ఇష్టమైన రొయ్యల ఫలావ్‌ తయారు చేయడం ఎలాగో ఇప్పుడు మీరు తెలుసుకోండి అంటూ తయారీ విధానాన్ని వివరించాడు.

చివరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఈ రెసిపీ ఛాలెంజ్‌ విసురుతున్నాను నా అభిమానులంతా తమకు ఇష్టమైన వంటకం ఏంటో నాతో పంచుకోండి అంటూ షేర్ చేసుకున్నాడు. ఇలా తనకు నచ్చిన రొయ్యల పలావ్‌ విషయాన్నీ ప్రభాస్ బయట పెట్టాడు. ప్రస్తుతం ఈ రెసిపీ చాలెంజ్ కాన్సెప్ట్ సినిమా ప్రమోషన్కు కూడా బాగానే వర్కౌట్ అవుతుంది. స్టార్ హీరోల ఫ్యాన్స్ అందర్నీ కనెక్ట్ చేస్తూ సినిమా ప్రమోషన్స్ జరుపుతున్నారు. ఇలా సినిమా ప్రమోషన్స్ జరపడం కూడా మంచి ఎత్తుగడ.. కానీ కాస్త ముందే స్టార్ట్ చేసి ఉంటే బాగుండేదని ఇప్పటికే చాలా లేట్ అయిందని ప్రేక్షకుల అభిప్రాయం.