ప్రిన్స్ యావర్ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా.. తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

బిగ్ బాస్ షో కి వచ్చే కంటెస్టెంట్స్ అందరూ బాగా రిచ్ పీపుల్ అని అంత అనుకుంటారు. బాగా డబ్బు ఉన్నవాళ్ల నే హౌస్ లో కి తీసుకొస్తారు అని భావిస్తుంటాం. అయితే అక్కడ జరిగే పరిస్థితి మాత్రం వేరుగా ఉంటుంది.  నిజానికి బిగ్ బాస్ షో కి వచ్చే వాళ్ళందరూ రిచ్ పీపుల్ అని అనుకోవడం పొరపాటనే చెప్పాలి. హౌస్ లో సామాన్యులు,పేద ప్రజలు కూడా ఉంటారు. ఇక బిబి హౌస్ లోకి ఏంటర్ అవ్వాలంటే అకౌంట్ లో ఎంతకొంత మనీ కూడా ఉండాలి. ఇక వీకెండ్స్ లో మంచి మంచి బట్టలు వేసుకోవాలి. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఉండడానికి కాస్త చోటు, తినడానికి తిండి మాత్రమే దొరుకుతుంది, మిగితావన్ని వారి కుటుంబ సభ్యులే పంపించాల్సి ఉంటుంది.

అయితే బిగ్ బాస్ 7 లో కంటెస్టెంట్ అయిన ప్రిన్స్ యావర్ ని చూస్తే బాగా డబ్బులు ఉన్న కుటుంబానికి చెందినవాడిలా కనిపిస్తాడు. కానీ అతని లుక్ కి, ఆర్థిక పరిస్థితికి అసలు పొంతన లేదు అనే విషయం తాజాగా బయట పడింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో ప్రిన్సి యావర్ తన కష్టాలను శివాజీతో చెప్పుకుంటూ కంటనీరు పెట్టుకున్నాడు. పవర్ అస్త్రా గెలవడం కోసం ప్రిన్స్ చాలా కష్టపడ్డాడు. బిగ్ బాస్ ఇచ్చిన కఠినమైన టాస్క్ లో ప్రిన్స్ పై పేడ, గడ్డి వేసినా చలించకుండా అలానే నిల్చున్నాడు. ఇంత కస్టపడిన తరువాత కంటెండర్ రేస్ నుండి ప్రిన్స్ ని తొలగించారు ప్రియాంక, శోభా శెట్టి.

దాంతో ప్రిన్స్ కోపం కట్టలు తెంచుకొని వారితో గొడవ పెట్టుకొని తన బొమ్మను తానే సుత్తితో పగలకొట్టేసాడు. ఆ తరువాత శివాజీ దెగ్గరకి వెళ్లి తన బాధనంత వెళ్ళగక్కాడు. ప్రిన్స్ మాట్లాడుతూ ‘ నేను లోన్ తీసుకొని ఇక్కడికి వచ్చాను. నా బ్యాంకు బ్యాలెన్స్ జీరో. 100 రూపాయలు కూడా నా దెగ్గర లేవు. ఆకలి నుండి పుట్టిన ఆవేశం సార్ నాది. ఎంత కష్టపడి ఆడిన కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. నాకున్న మూడు ప్యాంటులనే ఉతికి మళ్ళీ వేసుకుంటున్నాను. ఎందుకంటే నా పేరెంట్స్ ఆర్థిక స్తోమత ఏంటో నాకు తెలుసు కాబట్టి వాళ్ళని బట్టలు పంపమని నేను అడగలేను’ అని ఏడ్చుకుంటూ శివాజీ తో చెప్తాడు. దాంతో శివాజీ నీకు టైమ్ వస్తుంది, ఏడవకు అంటూ ప్రిన్స్ ని ఓదార్చాడు. ప్రిన్స్ ఆర్థిక స్థోమత తెలుసుకున్న ఆడియన్స్ అతనిపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.