చిరంజీవి లైఫ్ లో నిజమైన సావిత్రి బ్లెస్సింగ్స్.. ఏం జరిగిందంటే..?

మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. సీరియల్స్ లో నటిస్తూనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. మొదట విలన్ గా నటించి, చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి హీరోగా మారి మెగాస్టార్ చిరంజీవిగా మంచి క్రేజ్‌తో కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుతం చిరంజీవికి సంబంధించి ఓ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చిరంజీవి – సావిత్రి కలిసి ఓ సినిమాలో నటించారట. ఇంతకీ ఏంటా సినిమా అనుకుంటున్నారా.. చిరంజీవి కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న కీరోల్స్‌లో కూడా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఒకప్పటి హిట్ సినిమా అయిన పునాదిరాళ్లు సినిమాలో సావిత్రి హీరో క్యారెక్టర్ కు అమ్మగా నటించింది. అదే సినిమాలో చిరంజీవి కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. సావిత్రితో కలిసి ఒకే స్క్రీన్ పై రెండు మూడు సన్నివేశాల్లో కూడా కనిపించాడు.

అయితే ఆ సందర్భంలో సావిత్రిని.. చిరంజీవి కలిసినప్పుడు ఆమె చిరుని నువ్వు పెద్ద స్టార్ అవుతావు అని బ్లెస్‌ చేశారట. సావిత్రి బ్లెస్సింగ్స్ నిజమయ్యాయి. చిరంజీవి కాస్త ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ పెద్ద మెగా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చిరు విష‌యంలో సావిత్రి బ్లెస్సింగ్స్ నిజమయ్యాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.