మృణాల్ చేసిన ఆ ఒక్క పనికి తెలుగు ఆడియోన్స్ అందరూ ఫిదా..

ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్స్ చాలామంది టాలీవుడ్ లో రాణిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అలా టాలీవుడ్ లో పాపులర్ అవుతున్న హీరోయిన్స్ లో బాలీవుడ్ భామ మృణాల్ ఠాగూర్ కూడా ఒకరు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘సీతారామం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ చిన్నది ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది.మృణాల్ తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అందం,అభినయం కలబోసిన ఈ ముద్దుగుమ్మ  తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో సీత పాత్రలో అద్భుతంగా నటించి ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. దాంతో టాలీవుడ్ లో వరుస సినిమా లో నటిస్తూ బాగా బిజీ అయిపొయింది. ఈ అమ్మడు ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న ‘ అనే సినిమా లో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాలో కూడా మృణాల్ కనిపించబోతుంది అని సమాచారం. ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాభోతుంది. అంతేకాకుండా అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న ‘ నా సామీ రంగ ‘ అనే సినిమా లో కూడా మృణాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

 

ఇక మెగాస్టార్ చిరంజీవి 157 వ సినిమా కూడా మృణాల్ కి అవకాశం దక్కినట్లు ప్రచారం జరుగుతుంది. ఇలా యంగ్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకూ అందరితో జతకట్టబోతుంది  ఈ ముద్దుగుమ్మ. ఇలా వరుసగా తెలుగు సినిమా లో నటిస్తుండటంతో మృణాల్ కి తెలుగు నేర్చుకోవాలనే కోరిక పుట్టిందట. అందుకే ఎక్కువగా తెలుగు క్లాసులు వింటుందట. దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసింది మృణాల్. ఈ వీడియో ని చూసిన తెలుగు ప్రేక్షకులు మృణాల్ ఆన్లైన్ లో తెలుగు నేర్చుకుంటునందుకు తెగ సంబరపడిపోతున్నారు. చాలామంది మృణాల్ డెడికేషన్ కి ఫిదా అవుతున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు.