రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌కు స‌ర్జ‌రీ… ఫ్యాన్స్‌లో ఒక్క‌టే ఆందోళ‌న‌…!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఓ స్థాయిలో వెళ్ళింది. ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ప్రభాస్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా బాహుబలిని మాత్రం ఢీకొట్టలేకపోయాయి. ప్రస్తుతం ప్రభాస్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు.

గత కొంతకాలంగా ప్రభాస్ మోకాలు నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ‘ ఆదిపురుష్ ‘ మూవీ ప్రమోషన్స్ సమయంలో కూడా ప్రభాస్ మోకాలు నొప్పితో ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ కు సర్జరీ జరగబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ వారంలో ప్రభాస్ కు సర్జరీ కానుందట. దీని కోసం ఆయన యూకే వెళ్లినట్లు సమాచారం. ఆపరేషన్ అనంతరం మరో 15 రోజులు ప్రభాస్ అక్కడే ఉండే అవకాశం ఉంది. ఇక ఇక్కడకు వచ్చిన తరువాత నెల రోజుల పాటు ఇంటిపట్టున ఉంటూ రెస్ట్ తీసుకోవాలట. ఇక ‘ సలార్’ కు సంబంధించిన పనులు పూర్తి అయ్యయి .. ప్రమోషన్స్ పనులు పూర్తి కావాల్సి ఉంది.