తమిళ సినిమాకు రోజుకి అంత డిమాండ్ చేస్తున్న నటుడు సునీల్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో కమెడియన్ సునీల్ కూడా ఒకరు. ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కొద్ది రోజులు సైలెంట్ అయినా సునీల్ మళ్లీ కమెడియన్గా మంచి పాపులారిటీ అందించారు. ఆ తర్వాత మర్యాద రామన్న సినిమాతో హీరోగా పాపులారిటీ సంపాదించడంతో హీరోగా పలు చిత్రాలలో నటించి ఫెయిల్యూర్ గా మిగిలారు. దీంతో పుష్ప సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన సునీల్ కు ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో నటించే అవకాశం దక్కించుకుంటున్నారు.

Sunil sports keikogi in his first look from Rajinikanth's Jailer, see photo  | Tamil News - The Indian Express

అంతేకాకుండా ఇతర భాషలలో సైతం విలన్ గా నటిస్తున్న సునీల్.. తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో బిజీ యాక్టర్ గా మారిపోయారు. అక్కడ కమెడియన్ గా కంటే విలన్ గానే బాగా మెప్పిస్తున్నారు. తెలుగు సినిమాలలో నటించిన కూడా మునుపటిలాగా ఆయనకు పాత్రలు రావడం లేదు..ఇలాంటి సమయంలో కోలీవుడ్లో మంచి అవకాశాలు అందుకుంటున్నారు ఇటీవల జైలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

అంతేకాకుండా శివ కార్తికేయన్ మహావీరన్ సినిమాలో విలన్గా నటించారు. తమిళ ప్రేక్షకులను బాగా మెప్పించిన సునీల్ తాజాగా మార్కు ఆంటోనీ సినిమాలో కూడా మెప్పించారు. తమిళంలో సునీల్ రెమ్యూనరేషన్ తెలిసి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు.తెలుగులో ఒక్కో సినిమాకి రోజుకి రూ.30 వేల రూపాయల తీసుకుంటున్న సునీల్ తమిళంలో రోజుకి రూ .60 వేల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంత మొత్తంలో దర్శక నిర్మాతలు ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.