కూతురు మరణంతో  సంచలన నిర్ణయం తీసుకున్న విజయ్ ఆంటోని..!

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఇటీవల చెన్నైలోనే తన నివాసంలో మంగళవారం రోజున ఫ్యాన్ కి ఉరి వేసుకొని మరణించిన విషయం తెలిసిందే. ఇక మీరా మరణం సినీ పరిశ్రమను ఒక్కసారిగా కలచివేసింది. ఇక తన కూతురి మరణం తర్వాత మొదటిసారి విజయ్ ఆంటోని సోషల్ మీడియా ద్వారా స్పందించారు… తన కూతురు మరణంతో తాను కూడా చనిపోయానంటూ భావోద్వేగానికి గురైన విజయ్ ఆంటోనీ .. ఇకనుంచి తాను చేయబోయే ప్రతి పనికి కూడా తన కూతురి పేరు పెడతానని తెలిపారు..

ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకు వచ్చారు.. “నా కూతురు మీరా ఎంతో దయగలది.. అంతకుమించి ధైర్యవంతురాలు కూడా.. కులం, మతం, బాధ, అసూయ, డబ్బు, పేదరికం, చెడు, ద్వేషపూరిత వాతావరణంలేని ప్రశాంతమైన చోటుకు వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా ఆమె నాతో ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఆమె చనిపోయినప్పుడు తనతో పాటే నేను కూడా చనిపోయాను. ఇకనుంచి నేను చేసే ప్రతి మంచి పనిని కూడా నేను ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను” అంటూ విజయ్ ఆంటోని ట్విట్టర్లో ఒక లేఖను పోస్ట్ చేశారు.

 

ఇకపోతే మీరా మరణం తర్వాత ఆమె అంతక్రియలను ఇటీవలే నిర్వహించారు. చదువుల ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరొకవైపు మీరా చదువుపై ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు మీరా స్కూల్ సిబ్బంది కూడా మీరా మరణానికి కారణాలు తెలియదనే చెప్పారు. ఇకపోతే ఇటీవల పోలీసులు ఆమె మరణం పై దర్యాప్తు చేపట్టగా త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తామని చెబుతున్నారు.