స్లీవ్ లెస్ టాప్ లో రెచ్చగొడుతున్న ఫరీదా అబ్దుల్లా.. కవ్వించే ఫోజులతో..

యంగ్ బ్యూటీ ఫ‌రియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జాతి రత్నాలు మూవీతో ఫరీయా అబ్దుల్లా టాలీవుడ్‌కి పరిచయమైన సంగతి తెలిసిందే. దర్శకుడు అనుదీప్ కేవీ రూపొందించిన జాతి రత్నాలు సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ప్రధానుపాత్రలో నటించగా హీరోయిన్ పాత్రలో ఫరియా వీరిని మించి కామెడీని పండించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఓవర్ నైట్ లో స్టార్డం సంపాదించుకుంది ఫరియా. ఈ సినిమాలో ఈమె న‌ట‌న‌కు కోట్లాదిమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫ‌రియాకి ఆ సినిమాతో వరుస అవకాశాలు వ‌స్తాయి అనుకుంటే.. అంతంత మాత్రం గానే సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా తరువాత బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన ఫ‌రియా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ‌డంతో మంచి క్రేజ్ ద‌క్కించుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అలాగే ఇటీవల వచ్చిన రావణాసుర సినిమాలో కూడా నటించింది కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులకు క‌నెక్ట్ కాలేదు. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు మరింతగా తగ్గాయి.

ప్రస్తుతం ఆఫర్స్ కోసం తెగ ప్రయత్నిస్తుంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ కొత్త ట్రెండ్స్ తో స్పెషల్ లుక్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా ఫ‌రియా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అయింది. స్లీవ్ లెస్ టాప్‌లో ఎద‌ అందాలు విందు చేసింది. ఆ ఫోటోలకు ప్రిన్సెస్ ఆఫ్ జంగిల్ అంటూ ట్యాగ్ కూడా చేసింది. ఫరీయా హాట్ గ్లామర్ తో టెంపరేచర్ పెంచేసింది.. కవ్వించే ఫోజులతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్న ఫరీయా అప్లోడ్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.