బాలయ్య – బాబి మూవీలో ఆ యంగ్ హీరో..!

నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలకు దీటుగా వరుస సినిమాలలో నటిస్తూ హిట్ మూవీల‌ను తన ఖాతాలో వేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అక్టోబర్ 19న దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. మరోపక్క బాలకృష్ణ వాల్తేరు వీరయ్య డైరెక్టర్.. బాబీతో కూడా ఓ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి.

సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు. త్రివిక్రమ్ సొంత బ్యానర్ అయిన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఇక బాలయ్య – బాబి కాంబినేషన్ ఈ మూవీ సెప్టెంబర్ 21 నుంచి సెట్స్‌ పైకి రానుంది. కానీ ఇప్పుడు సెప్టెంబర్ 27 కు మారినట్లు టాక్. ఈ సినిమా కథ ప్రకారం మరో హీరోకు కూడా ఛాన్స్ ఉందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దీంతో ఈ మూవీ టీం ఆల్రెడీ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ టీంను కాంటాక్ట్ అయినట్లుగా సమాచారం. కానీ దుల్కర్ టీం నుంచి ఇంకా ఎటువంటి క్లారిటీ రాకపోవడంతో నెక్స్ట్ లైన్ అప్ లో నానిని కూడా అప్రోచ్ అయిందట మూవీ టీం. నాని కూడా హ్యాండ్ ఇస్తే వేరెవరైనా ఇంకో యాంగ్ హీరోతో కంప్లీట్ చేయాలని దర్శకుడు బాబి అండ్ మూవీ టీం అనుకుంటున్నారట. చూడాలి మరి బాలయ్యతో నటించే ఈ మంచి అవకాశాన్ని ఏ యంగ్ హీరో సొంతం చేసుకుంటాడో.