జవాన్ మూవీతో హీరో నాని కి సంబంధం ఏంటి.. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కించిన `జ‌వాన్‌` సినిమా ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంశం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించిన ఈ సినిమాతో న‌య‌న‌తార బాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. అలాగే ఇందులో కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి విల‌న్ రోల్ ను పోషించ‌గా.. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

సెప్టెంబ‌ర్ 7న విడుద‌లైన ఈ చిత్రం హిట్ టాక్ తో ఎక్స‌లెంట్ వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. విడుద‌లైన ఐదు రోజుల్లోనే జ‌వాన్ వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 500 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకుంది. అత్యంత వేగంగా రూ.500 కోట్ల క్లబ్ లో చేరిన హిందీ సినిమాగా జ‌వాన్‌ రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ లీక్ అయింది. జ‌వాన్ మూవీతో టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని కి సంబంధం ఉంద‌ట‌.

అస‌లు విష‌యం ఏంటంటే.. జ‌వాన్ లో షారుఖ్ ఖాన్ కు ధీటుగా బిజినెస్‌మ్యాన్, వెపన్స్ డీలర్ కాళీ గైక్వాడ్ పాత్ర‌లో విజయ్ సేతుపతి అద‌ర‌గొట్టేశాడు. సినిమాలో షారుఖ్ త‌ర్వాత విజ‌య్ సేతుప‌తి పాత్రే మెయిన్ హైలెట్ అయింది. అయితే ఈ పాత్రకు మొద‌ట నానీని ఎంపిక చేశార‌ట‌. ఆల‌స్యంగా ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. స్టోరీ న‌చ్చ‌డంతో విల‌న్ రోల్ అయిన‌ప్ప‌టికీ నాని వెంట‌నే అంగీక‌రించాడ‌ట‌. దీంతో డైరెక్ట‌ర్ అట్లీ నానికి లుక్ టెస్ట్ చేయించార‌ట‌. కానీ, ఓల్డ్ ఏజ్ లుక్ నానీకి అస్స‌లు సెట్ అవ్వ‌లేద‌ట‌. ఇదే విషయాన్నీ డైరెక్ట‌ర్ అట్లీ నాని తో చెప్పగా.. ఏం ప‌ర్వాలేదని చెప్పి జ‌వాన్ నుంచి త‌ప్పుకున్నార‌ట‌. ఆ త‌ర్వాత కాళీ రోల్ కోసం విజ‌య్ సేతుప‌తిని ఎంచుకున్నార‌ని నెట్టింట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.