అమలాపాల్ ఓ చెత్త హీరోయిన్.. యంగ్ హీరో సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

తమిళ్ స్టార్ హీరో గా గుర్తింపు తెచ్చిన మురళి కుమారుడు అధర్వ కూడా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొన‌సాగుతున్నాడు. 2010లో బాణ‌కాతాడి అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అధర్వ తర్వాత 2013లో విడుదలైన పరదేశితో మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఈ సినిమాతో ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు అధర్వ.

2019లో హరిష్‌శంకర్ డైరెక్షన్లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గద్దల కొండ గణేష్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో కొత్త వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ ప్రమోషన్స్‌కు హాజరైన ఆధర్వ మాట్లాడుతూ తనతో నటించిన హీరోయిన్ల‌లో అందరిలో అమలాపాల్ చెత్త హీరోయిన్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. నా రెండో సినిమా ముహుదుముత్ ఉన్ కర్పనై సినిమాలో మేమిద్దరం కలిసి నటించామని వివ‌రించాడు.

ఈ షూటింగ్ ప్రారంభమైన కొద్ది రోజులకే మా ఇద్దరి మధ్య చిన్న వివాదం జరిగిందని కానీ అది తర్వాత సెట్ అయింద‌ని చెప్పుకొచ్చాడు. నా కెరీర్ లో నేను న‌టించిన హీరోయిన్ల‌లో చెత్త‌ హీరోయిన్ అంటే అమలాపాల్ అని క‌మెంట్ చేశాడు. నేను ఈ విష‌యం స్వయంగా అమ‌లాపాల్‌కి కూడా చెప్పాను అంటూ అధర్వ వివరించాడు. దీంతో ఈ కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి.