చిరుకి ఆ హీరోయిన్ అంటే ఎంతో స్పెషల్.. ఆమె కోసం ఎవరికి ఇవ్వని ఆ ఒక్క వస్తువుని ఇచ్చేసాడుగా..!?

ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దన్నగా ఉన్న చిరంజీవి తాజాగా భోళాశంకర్ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వచ్చినప్పటికీ తన ఫాన్స్ ని మెప్పించలేకపోయాడు. బోరింగ్ సన్నివేశాలు సినిమాకి మైనస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఇంకొకసారి ఇటువంటి రీమేక్‌లు చేయకండి అంటూ కొంతమంది ఎన్నినెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ చిరంజీవి రీమేక్లతోనే స్టార్ హీరో అయ్యారు అనేది కొంతమంది వాదన.

ఇదంతా పక్కన పెడితే ఓ హీరోయిన్ కోసం ఎవరికీ ఇవ్వని వస్తువుని చిరంజీవి ఆ హీరోయిన్ కి ఇచ్చేశారట. చిరంజీవిని ఒకప్పుడు హీరోయిన్ మాధవి కారులో తన పక్కన కూర్చోవడానికి ఇష్టపడలేదట.
ఇక ఆ అవమానంతో ఆయనకు మార్కెట్లోకి ఏ కొత్త కారు వస్తే అది కొనుక్కుని తన రేంజ్ ఏంటో చూపించాడు. అయితే అప్పట్లో చిరంజీవి రూ.3 కోట్లు పెట్టి ఆ ఖరీదైన కార్‌ను కొన్నారట. ఇక ఆ కారుని ఎవర్ని ముట్టుకోనిచ్చే వారు కాదట.

మరీ ముఖ్యంగా దానిపై చిన్న గీత పడ్డ చిరంజీవి వారిపై అరిచే వారట. దాంతో పని వాళ్లు కూడా దాన్ని అపురూపంగా చూసుకునే వారట. చిరంజీవి అంత ఇష్టంగా కొనుక్కున్న కారుని రమ్యకృష్ణ కోసం ఇచ్చేసారట.అసలు విషయం ఏమిటంటే.. రమ్యకృష్ణ నరసింహ సినిమాలో ఒక స్టైలిష్ కారుతో ఎంట్రీ ఇచ్చిన సీన్ మీకు గుర్తుండే ఉంటుంది. అయితే ఆ సీన్ లో కనిపించింది చిరంజీవి కారేనట. ఆ సినిమాలో స్టైలిష్ కార్ తో రమ్యకృష్ణ ఎంట్రీ ఉండాలని డైరెక్టర్ అనుకున్నారట.

దాంతో మార్కెట్ మొత్తం చూశారు కానీ అంత వెరైటీ కార్‌ ఎక్కడ దొరకలేదట. రమ్యకృష్ణ పనుండి చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కారును చూసి మీ కారు ఎంతో బాగుంది మా షూటింగ్ కోసం ఇస్తారా అని అడిగిందట. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే తీసుకెళ్ళు అన్నారట … చిరంజీవికి అంత ఇష్టమైన కారును రమ్యకృష్ణ కోసం ఒక నెల రోజులు ఇచ్చేసారట.