అది జ‌రిగాకే పెళ్లి చేసుకుంటా.. బిగ్ బాంబ్ పేల్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం `ఖుషి` మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ లో విజ‌య్ కు జోడీగా సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత న‌టించింది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించారు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది.

స‌మంత ప్ర‌స్తుతం న్యూయార్క్‌లో ఉండ‌టంతో.. ఖుషి ప్ర‌మోష‌న్స్ బాధ్య‌త‌ల‌న్నీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే తీసుకున్నాడు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో విజ‌య్ దేర‌కొండ పెళ్లిపై బిగ్ బాంబ్‌ పేల్చాడు. ఇటీవ‌ల ఖుషి ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో విజ‌య్ మాట్లాడుతూ.. త్వ‌ర‌లోనే తాను పెళ్లి చేసుకుంటాన‌ని.. ఆ ఘడియలు దగ్గరలో ఉన్నాయని అనిపిస్తోందంటూ కామెంట్స్ చేశాడు.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పెళ్లి గురించి మ‌రికొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. `నేను అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోలేను. అమ్మాయి గురించి నేను ముందే తెలుసుకోవాలి. ఆమెతో ఎంతో సమయం గడపాలి. ఒక‌రినొక‌రు అర్థం చేసుకోవాలి. పెళ్లికి ఇద్ద‌రం మానసికంగా సిద్ధప‌డ్డాలి. అలాగే నాకు కాబోయే అమ్మాయి నా ఫ్యామిలీతో, ముఖ్యంగా నా తల్లితో మంచి బంధాన్ని పెంచుకోవాలి. ఆ త‌ర్వాతే పెళ్లి చేసుకుంటా` అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పుకొచ్చాడు. దీంతో రౌడీ హీరో కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.