దిల్ రాజు కంట్రోల్ నుంచి తప్పిన గేమ్ చేంజర్..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా లెజెండ్రీ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా రోజులు అయిపోయిన సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం బయటకు రావడం లేదు. దీంతో చరణ్ ఫాన్స్ గేమ్ చేజర్ మూవీ కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి అంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మెసేజ్ చేస్తూ హడావిడి చేస్తున్నారు.

ముఖ్యంగా దిల్ రాజును చాలా సార్లు అడుగుతూనే ఉంటున్నారుజ‌ ఇక తాజాగా వరుణ్ తేజ్ హీరోగా నటించిన గాండీవధారి అర్జున్ రిలీజ్ వేడుకలకు గెస్ట్‌గా హాజరయ్యాడు దిల్ రాజు. అక్కడ కూడా దిల్ రాజును ఫ్యాన్స్ గేమ్ చేంజ‌ర్‌ అప్డేట్స్ గురించి అడగగా.. దిల్ రాజు సినిమా గురించి మాట్లాడాడు. సినిమాపై తన పెత్తనం ఏమీ లేదని.. అంతా డైరెక్టర్ శంకర్ పైనే ఆధారపడి ఉందంటూ చెప్పకనే చెప్పేశాడు. నేను రాగానే మీరు అరిచినప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేశాను. గేమ్ చేంజర్‌ గురించి నాకు క్వశ్చన్స్ ఎదురవుతాయని.. మన చేతిలో ఏమీ లేదు డైరెక్టర్స్ ఇచ్చినప్పుడే ఏ అప్డేట్స్ అయినా బయటకి వస్తాయి. సో నేనుఏమ్‌ చేయలేను అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

నార్మల్‌గా అయితే దిల్ రాజు ప్రొడక్షన్లో మూవీ అంటే అన్ని బాధ్యతలు దిల్ రాజే తీసుకుంటాడు.. సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి, ప్రమోషన్స్ ఎలా చేయాలి అనే అంశాలపై స్ట్రాటజీ కూడా ఆయన చూసుకుంటాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇటీవల ఆయన మాటలు చూస్తుంటే గేమ్ చేంజర్‌ షూటింగ్ అంశాలు ఏవి దిల్ రాజు నిర్ణయం పై ఆధారపడి లేవని అంత శంకర్‌ కంట్రోల్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది అన్న క్లారిటీ అయితే ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తై విడుదల అవుతుందో క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాలో కియారా అధ్వాని హీరోయిన్గా.. అంజలి, సునీల్, శ్రీకాంత్, ఎస్ జె సూర్య కీరోల్స్‌లో నటిస్తున్నారు.