రష్మిక కి ఎసరు పెట్టిన శ్రీ లీల….. పాపం ఆమె నటించిన అన్ని సీన్లు డిలీట్ చేశారుగా‌…..!!

ప్రస్తుతం టాలీవుడ్‌లో మారుమోగుతున్న పేరు శ్రీ లీల. సినీ రంగంలోకి కొత్త హీరోయిన్ వచ్చిందంటే చాలు దర్శక, నిర్మాతల కళ్ళు అన్ని ఆమె మీదే ఉంటాయి. ఒకవేళ ఆమె నటించిన మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యి.. ఆమెకు మంచి గుర్తింపు వచ్చిందంటే ఇక‌ ఆమె కాల్ షీట్స్ కోసం నిర్మాతలు క్యూ కడతారు. ప్రస్తుతం ధమాకా ఫేమ్ శ్రీ లీల పరిస్థితి కూడా అంతే.

పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే తన గ్లామర్, డాన్స్లతో ఆకట్టుకుంది. ఆ తర్వాత ధమాకా సినిమాలో నటించి అందరి హృదయాలని కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత శ్రీ లీలా జాతకమే మారిపోయింది. అగ్ర హీరోల దగ్గరి నుంచి చిన్న హీరోల వరకు అంతా ఈమె జపమే చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీ లీల చేతిలో దాదాపు 10కి పైగా సినిమాలు ఉన్నాయి. అయినా కొత్త సినిమా ఛాన్స్ వస్తే కుదరదు అనకుండా ఓకే చెబుతుంది.

తాజాగా రష్మిక ప్లేస్ లో శ్రీలీలకు నటించే అవకాశం దక్కిందని వార్తలు వినిపిస్తున్నాయి. భీష్మ ఫేమ్ వెంకీ కుడుముల ప్రస్తుతం నితిన్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా రష్మికను ఎంపిక చేశాడు. వెంకీ ఫస్ట్ మూవీ నుంచి రష్మికనే నటిస్తూ వస్తుంది. రష్మిక ఉంటే ఆ సినిమా హిట్టే అని వెంకీ నమ్ముతూ వస్తున్నాడు. ఈ సినిమాలో కూడా రష్మికనీ తీసుకున్నాడు.

కాకపోతే షూటింగ్ ప్రారంభం కావడానికి ఆలస్యం అవ్వడంతో రష్మిక డేట్స్ అడ్జస్ట్ చేయలేక సినిమా నుంచి తప్పుకుందట. దీంతో ఆమె ప్లేస్‌లో శ్రీ లీలను ఎంపిక చేశాడట. ఇప్పటికే నితిన్, శ్రీ లీల కలిసి ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులం ముందుకి రానుంది. ఇక ఈ మూవీ ఆడియన్స్ ముందుకి రాకముందే నితిన్‌తో మరోసారి జోడి కట్టే ఛాన్స్ కొట్టేసింది శ్రీ లీల.