బిగ్ బాస్ లోకి వెళ్తే విడాకులే.. భర్తకి స్ట్రిక్ట్ కండిషన్ పెట్టిన టాప్ డైరెక్టర్ కూతురు

ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ సెలబ్రిటీగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ విజయభాస్కర్. స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ ఇలా ఎన్నో బ్లాక్‌బాస్టర్ హీట్లను అందించిన విజయభాస్కర్ తాజాగా అతని కొడుకుతో జిలేబి అనే సినిమాను రూపొందించాడు. ఇందులో రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్గా నటించింది. ఇక విజయ భాస్కర్ అల్లుడు రవి శివతేజ ఇతను పలు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఇతనికి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి కొడుకు శ్రీ సింహ న‌టించిన ఉస్తాద్‌ సినిమాలో రవి శివతేజ హీరోకు బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించాడు.
ఇక ఉస్తాద్‌ సినిమా గురించి స్పందించిన‌ రవి శివ‌తేజ జైల‌ర్, భోళాశంకర్ లాంటి పెద్ద సినిమాలు విడుదల అయినప్పుడు తమకు అంత స్పేస్ దొరకలేదని చెప్పుకొచ్చాడు. ఇక బిగ్‌బాస్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెలుగులో 400 కు పైగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు రవి శివతేజ.

విజయభాస్కర్ కూతురు శ్యామలను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని.. కష్ట సమయంలో కూడా నాకు శ్యామల తోడుగా నిలిచిందని వివరించాడు. అయితే వారిద్దరి మధ్యన ప్రేమ మొదలయ్యే సమయానికి ఆమె విజయభాస్కర్ కూతురు అని కూడా నాకు తెలియదని కొద్ది రోజుల తర్వాత అసలు విషయం తెలిసాక తమ పెళ్ళి జరుగుతుందో లేదో అనే భయం పట్టుకుందని వివరించాడు.

కానీ తమకు పెళ్లయిందంటే అందుకు ప్రధాన కారణం శ్యామల.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారి కుటుంబ సభ్యులను ఒప్పించింది అంటూ చెప్పుకొచ్చాడు. తను నా జీవితంలోకి రావడం నా అదృష్టం అంటూ ప్రశంసించాడు. కానీ బిగ్ బాస్ లోకి వెళ్తే తనకు విడాకులు ఇచ్చేస్తానని ఆమె వార్నింగ్ ఇచ్చిందట. తను కూడా ఈ షోకు వెళ్లాలని ఆలోచనలో లేడ‌ని తెలిపాడు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.