మూడు రోజులు.. 200 కోట్లు.. జైలర్ కలెక్షన్ల ఊచకోత..!

సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇండస్ట్రీ కి నెవ‌ర్ బిఫోర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. చిరు, కమల్ హాసన్ లాంటి ఎంతోమంది స్టార్ హీరోలు కమ్‌బ్యాక్‌ ఇచ్చారు కానీ రజనీకాంత్ రేంజ్ లో కమ్‌బ్యాక్ ని ఇండియన్ సినిమా ఇప్పటివరకు చూడలేదు. రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్గా నటించిన జైలర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతుంది.

మొదటి రోజు నుంచి కలెక్షన్‌ల‌ వర్షం కురిపిస్తున్న ఈ మూవీ రెండు రోజుల్లోనే దాదాపు అన్ని థియేటర్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కొల్లగొట్టింది. ఈ మూడు రోజుల్లో రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన జైలర్ మూవీ ముందు ముందు మరీనీ భారీ వసుళ్ళ‌ను కల్లగొట్టబోతుంది. ఇక నాలుగో రోజు ఆదివారం కావడంతో ఈ సినిమా బిగ్గెస్ట్ సండే కలెక్షన్స్ ని చూడబోతుంది. ఇదే జరిగితే జైలర్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం.

ఇక 5వ‌రోజు తప్పిస్తే 6వ‌రోజు ఇండిపెండెన్స్ డే హాలిడే రజిని బాక్సాఫీస్ దగ్గర చేయబోయే సంచలనం ఊహిస్తేనే ఎదో రికార్డు సృష్టించ‌బోతుంది అనిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు ఉన్న బుకింగ్ ట్రెండ్స్ ని చూస్తే సినిమా మొదటివారం ఎండ్‌ అయ్యేసరికి రూ.500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక లాంగ్ రన్ లో జైలర్ ఎంతవరకు కలెక్షన్స్ వసూళ్ళు చేస్తుంది అనేది తలైవార అభిమానులు చేతిలో ఉంది.