అల్లు అర్జున్ అవార్డుకి బాలయ్య రియాక్షన్ ఇదే..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఎలాంటి రికార్డు క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు సినీ పరిశ్రమలోని ఇప్పటివరకు ఎవరు సాధించలేని రికార్డును సైతం అల్లు అర్జున్ సాధించారు. పుష్ప సినిమాలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడుగా కూడా అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఏ తెలుగు నటుడు కూడా ఇప్పటివరకు ఇలాంటి అవార్డు అందుకోలేకపోయారు. దీంతో సర్వత్ర అల్లు అర్జున్ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అభిమానులు సినీ సెలబ్రిటీలు.

 

ఈ అవార్డు వచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ కూడా ఎమోషనల్ కావడం జరిగింది.తన భార్య స్నేహారెడ్డిని హత్తుకొని మరి కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై బాలయ్య మాట్లాడుతూ .. బన్నీ కి జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు రావడం ఒక నటుడుగా తనకు చాలా గర్వకారణంగా ఉందని బాలకృష్ణ తెలియజేయడం జరిగింది.. చలనచిత్ర రంగానికి ఇది కూడా గర్వకారణం అని తెలిపారు..RRR చిత్రానికి 6.. అవార్డులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని. అలాగే ఆర్ఆర్అర్ సినిమాకు ఆస్కార్ వచ్చింది.. ఇప్పుడు జాతీయ అవార్డు కూడా వచ్చాయని అదే విధంగా ఉప్పెన సినిమాకి అవార్డు రావడం చాలా సంతోషంగా అనిపించిందని తెలియజేశారు.

ఈ అవార్డు వచ్చిన వారందరికీ పేరుపేరునా తన నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని బాలయ్య తెలియజేయడం జరిగింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన ఒక స్పెషల్ గా ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి డైలాగులు పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పలువురు క్రికెటర్లు సైతం పుష్ప స్వాగ్ ని ఫాలో అయ్యారు. అందుకే ఈ సినిమా అంత స్పెషల్ అని కూడా చెప్పవచ్చు. ఈ సినిమాని సుకుమార్ దర్శకత్వం వహించగా హీరోయిన్గా రష్మిక నటించింది. త్వరలోనే ఈ సినిమా రెండవ భాగం కూడా థియేటర్లోకి రాబోతోంది.