త‌గ్గేదేలే అంటోన్న ర‌ష్మిక‌… ఇట్స్ పార్టీ టైం అంటూ రెచ్చిపోతోందిగా…!

పుష్పది రైజ్‌ సినిమాలో నటించిన అల్లు అర్జున్‌కు ఇటీవల ఉత్తమ నటుడుగా 69వ ఇంటర్నేషనల్ ఫిలిమ్‌ఫేర్‌ అవార్డ్‌ దక్కింది. దీంతో బెస్ట్ యాక్టర్ విభాగంలో ఇంటర్నేషనల్ ఫిలిమ్‌ఫేర్‌ అవార్డును గెలుచుకున్న మొదటి తెలుగు స్టార్‌గా రికార్డ్ సృష్టించాడు. ఈ సందర్భంగా రష్మిక మందన అల్లు అర్జున్ కి అభినందనలు తెలియజేసింది.

ఈ సినిమాలో పుష్పరాజ్‌ను ప్రేమించి పెళ్లాడే అమ్మాయి శ్రీవల్లిగా రష్మిక నటించింది. ఈ గురువారం జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిమ్‌ఫేర్ అవార్డ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ అందుకున్న విక్టరీని రష్మిక మందన తెలియజేస్తూ.. అల్లు అర్జున్ షేర్ చేసిన ఉల్లాసంగా ఉరుములతో కూడిన గదిలో బన్నీ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిన వీడియోని రష్మిక రీషేర్ చేసింది.

బన్నీకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికలో ” పుష్పరాజ్.. అస్సలు తగ్గేదేలే.. అభినందనలు.. ఇట్స్ పార్టీ టైం.. ” అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియోతో పాటు రష్మిక షేర్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.