భోళా శంకర్ సినిమా ఫ్లాప్ కి కారణాలు ఇవే..!!

చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న విడుదలై ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది..మొదటి షోకే ప్రేక్షకులకు కూడా ఈ సినిమాని చూడడానికి ఇష్టపడలేదు.అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల కేవలం జబర్దస్త్ బ్యాచ్ వల్లే జరిగింది అనే వార్తలు వినిపించాయి.. ముఖ్యంగా హైపర్ ఆది భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి పైన అతిగా స్పీచ్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఎక్కువగా చిరంజీవిని పొగడమే కాకుండా ఒక డైరెక్టర్ ని కించపరిచే విధంగా మాట్లాడడం కూడా జరిగింది.

Bhola Shankar OTT Release: When And Where To Watch Megastar Chiranjeevi's  Comedy-Action Film

దీంతో ఆ డైరెక్టర్ చిరంజీవిని అన్నయ్య అంటూ భజన చేస్తూ ఆయననే చెడగొడుతున్నారు ఇది నిజం అంటూ సోషల్ మీడియాలో కూడా పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ఈ విషయంపై వర్మ ఒక ట్విట్ వల్లే మరిన్ని వార్తలు కూడా పుట్టుకొచ్చాయి.. అయితే భోళా శంకర్ సినిమా ఫ్లాప్ వెనుక డైరెక్టర్, స్క్రీన్ ప్లే ,ఇతర టెక్నీషియన్ కూడా ఉంటారు.. ఒకవేళ హీరో సరిగ్గా చేయకపోయినా సరే ఆ హీరోని బ్లేమ్ చేస్తూ ఉంటారు..

Keerthy Suresh at Bholaa Shankar Movie Pre Release Event | Filmyfocus.com -  YouTube

అయితే జబర్దస్త్ వాళ్ళు మాత్రం ఈ మధ్య చిరంజీవికి అతిగా భజన చేస్తున్నారు అనే మాట వాస్తవమే..కానీ వారు పొగిడితే పొంగిపోయి మరి వారికి అవకాశాలు ఇస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. డైరెక్టర్ మెహర్ రమేష్ కూడా వరుస ప్లాపులలోనే ఉన్నారు అందుకు తోడు ఫ్రీ రిలీజ్ ప్రమోషన్స్ టాక్ లో అన్నయ్య అన్నయ్య అంటూ పలువురు కమెడియన్లు సైతం అతి చేయడంతో పాటు ఫంక్షన్ లో చిరంజీవి వయసుకు తగ్గ ప్రవర్తన.. (కీర్తి సురేష్ విషయంలో) అతి చేసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి..

 

దీంతో ఆడియో ఫంక్షన్ కూడా ఫ్లాప్ అని ఇలా అన్ని కారణాల చేత ఈ సినిమాకు పెద్ద మైనస్ అయిందని అందుకే భోళా శంకర్ సినిమా ఫ్లాప్ అయ్యిందని ప్రచారం జరుగుతోంది. కథల ఎంపిక విషయంలో కూడా కాస్త అలర్ట్ ఉండాలని పలువురు అభిమానులు తెలుపుతున్నారు.