ఒక్కసారిగా అనసూయలో ఈ మార్పు..ఇలా అయ్యిందేంటి..?

తెలుగు బుల్లితెరపై హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా పేరు సంపాదించింది యాంకర్ అనసూయ.. ఈమె గురించి రెండు రాష్ట్రాల్లోని ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. యాంకర్ గా మొదట తన కెరీర్ ను ప్రారంభించి ఆ తర్వాత బుల్లితెర పైన పలు అవకాశాలను అందుకుంది. తన యాంకరింగ్ తో గ్లామర్ అందాలను వోలకబోస్తూ ఆ తర్వాత యాక్టర్ గా కూడా పాపులారిటీ అందుకున్నది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తరచూ పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది.

Anasuya Bharadwaj honours the unsung heroine of 1857, Begum Hazrat Mahal,  by recreating her look-Telangana Today

ఎప్పుడు కాంట్రవర్సీ ట్వీట్ తో హాట్ టాపిక్ గా మారుతూ ఉండే అనసూయ గత కొద్ది రోజులుగా ఒక్కసారిగా తనలో మార్పు వచ్చిందంటూ తెలియజేసింది. తాజాగా ఈమె చేసిన మరొక ట్విట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె దేశం కోసం పోరాడిన యోధురాలు బేగం హజరత్ మహల్ ను గుర్తు చేసుకుంటూ ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది.. ఈ ఫొటోస్ ను రీ క్రియేట్ చేస్తూ నివాళులు అర్పించడం జరిగింది.

1857 కాలం నాటి స్వతంత్ర సమరయోధురాలు అవాది క్వీన్ బేగం హజరత్ మహల్ దేశం కోసం పోరాడినందుకుగాను 1984లో మే 10న ఈమె గుర్తుగా ఒక ఫోటోతో ప్రభుత్వం ఒక స్టాంప్ ను సైతం విడుదల చేయడం జరిగింది. తన పోరాట పటిమతో మనలో చాలా స్ఫూర్తిని నింపిన ఈమెను ఒక్కసారి స్మరించుకుందా అంటూ అనసూయ ట్వీట్లు చేయడం జరిగింది. అయితే అనసూయ ఆ ఫోటోలతో తన ముఖంతో రీ క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఒక్కసారిగా అనసూయలు ఇలా మార్పు రావడం వల్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)