సాయి పల్లవి ఆ రోల్ రిజెక్ట్ చేసి బతికిపోయింది కానీ.. ఊహించుకుంటేనే..

టాలీవుడ్ అగ్రతారలు సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరూ భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటించే అవకాశం పొందారు. సాయి పల్లవి రెండో ఆలోచన లేకుండా ఈ పాత్రను రిజెక్ట్ చేసింది. కీర్తి సురేష్ మాత్రం మెగాస్టార్ చెల్లిగా మెరిసేందుకు అంగీకరించింది, అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. రిలీజ్ అయిన రెండు రోజులకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది అభిమానులు, ప్రేక్షకులు కీర్తి తన ఇమేజ్‌కి తగని పాత్రను ఈ సినిమాలో చేసిందని చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్ర చేసిందని పెదవి విరిచారు. ఓల్డ్ హీరోకి సోదరి పాత్రను పోషించారని విమర్శించారు.

మరోవైపు చిరంజీవి సోదరి పాత్రను సాయి పల్లవి తిరస్కరించింది. అలాంటి పాత్రల్లో టైప్ కాస్ట్ కాకుండా ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది. సాయి పల్లవి తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది నెటిజన్లు ప్రశంసించారు, ఆమెది సరైన ఎంపిక అని భావించారు. నటీనటులు తాము చేసే పాత్రల విషయంలో సెలెక్టివ్‌గా ఉండటం ముఖ్యమని భోళా శంకర్ వైఫల్యం చూపించింది. ఒక నటుడు ఒక నిర్దిష్ట పాత్రలో టైప్‌కాస్ట్ చేస్తే, అది వారి ఇమేజ్‌ను దెబ్బతీస్తుంది. ఇతర మంచి పాత్రలను పొందకుండా కెరీర్ డ్యామేజ్ చేస్తుంది.

ఇలాంటి రోటీన్ పాత్రను తిరస్కరించి సాయి పల్లవి సరైన నిర్ణయం తీసుకుంది. ఆమె ముందుచూపు నిర్ణయాలు ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నాయి. సాయి పల్లవి ఎంతటి క్లిష్టమైన పాత్రనైనా ఇట్టే చేయగలుగుతుంది. ఆమె రొమాంటిక్ డ్రామాలు, యాక్షన్ థ్రిల్లర్లు, సోషల్ కామెడీలతో సహా విభిన్న చిత్రాలలో నటించింది. కీర్తి సురేష్ కూడా అనేక విజయవంతమైన చిత్రాలలో నటించిన టాలెంటెడ్ యాక్ట్రెస్. అయితే, ఆమె ఒక పెద్ద హీరోకి సోదరి పాత్రలో తప్పు చేసిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ సాయి పల్లవి ఈ పాత్ర చేసి ఉంటే ఆమె ఖాతాలో మరొక డిజాస్టర్ పడి ఉండేది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ గార్గి, విరాటపర్వం లాంటి ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతోంది. మళ్లీ ఆమె కెరీర్ లో ఫ్లాప్ వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు ఆమెకు అది జరగలేదు కాబట్టి ఇప్పుడు అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు.