రోడ్డు ప‌క్క‌న కారు ఆపి ఆ ప‌ని కానిస్తోన్న భార్య‌, భ‌ర్త.. అడ్డంగా బుక్ ( వీడియో )

రాజస్థాన్ దౌసా జిల్లాలోని ఢిల్లీ – ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే పైన ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన కారు ఆపి అక్కడ ఉన్న మొక్కల కుండీలను ఎత్తుకెళ్లిపోయింది ఓ జంట. ఆ భార్యాభర్తలు భ‌యం గ‌వ‌ర్న‌మెంట్ మొక్క‌లు అని భ‌యం లేకుండా చేసిన పనికి నిటిజన్లు షాక్ అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇటీవల ఓ భార్య భర్త స్కార్పియో కారులో అబానరీ సర్కిల్ వద్ద హైవేకి పక్కన కారు ఆపారు. ఆ తర్వాత కారులోంచి దిగిన ఆ జంట పట్టపగలే రోడ్డు పక్కన ఉన్న మొక్కలను తీసుకొని కారులో పెట్టుకుని వెళ్లిపోయారు. అలంకారం కోసం రోడ్డుకు ఇరువైపులా అమర్చిన ఆ మొక్కలను మొత్తంగా పది కుండీలతో దొంగలించారు. అదంతా సర్వసాధారణం మేం చేస్తుంది పెద్ద తప్పు ఏం కాదు అన్నట్లుగా వారు బిహేవ్ చేశారు.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులపై గట్టి సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాపం ఈ జంటకి ఆ విషయం తెలియనట్టుంది.. మనం చేసేదేమి తప్పు కాదు అన్న ధోర‌ణిలో ఆ మొక్కలను తీసుకొని కారులో పెట్టుకొని వెళ్లిపోయారు. కానీ సిసిటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఎన్‌హెచ్ఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ జంట పై బండికూయి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ అయింది.