సమంతతో సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఆగ్రహంలో రష్మిక?

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనతి కాలంలోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ నటుడు టెరిఫిక్ యాక్టింగ్ పర్ఫామెన్స్, అద్భుతమైన డైలాగు డెలివరీతో టాలీవుడ్ ఇండస్ట్రీ అంతటా ప్రత్యేకమైన హీరోగా నిలుస్తున్నాడు. అతను దాపరికం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రజల్లో మరింత పాపులర్ కూడా అవుతున్నాడు.

ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో విజయ్‌ను అతని సెలబ్రిటీల క్రష్ ఎవరో చెప్పాలని అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తూ సమంత రూత్ ప్రభుపై తనకు ఎప్పటి నుంచో క్రష్ ఉందని విజయ్ అన్నాడు. ఈ సమాధానం చాలా మంది అభిమానులను ఆశ్చర్యపరిచింది, ఎందుకంటే విజయ్ నటి రష్మిక మందన్నాతో అఫైర్ నడిపిస్తున్నాడని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి బయటకు కనిపించడం, వెకేషన్లకు వెళ్లడం, ఇంకా పండగల సమయంలో ఒకే ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకోవడం వల్ల వీరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని చాలామంది అభిమానులు నమ్మారు. అయితే విజయ్ మాత్రం తాము కేవలం స్నేహితులం మాత్రమేనని ఎప్పటినుంచో సీక్రెసి మెయింటైన్ చేస్తున్నాడు.

విజయ్ ఇప్పుడు సమంత పై తనకు ప్రేమ ఉందని వెల్లడించడం అతని అభిమానులలో చర్చకు దారితీసింది. ఎట్టకేలకు సమంతపై తనకున్న ప్రేమను ఒప్పుకున్నాడని కొందరు సంతోషం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం రష్మిక సంగతేంటి మరి అని నిరుత్సాహానికి గురవుతున్నారు. రష్మిక కూడా ఈ వ్యాఖ్యలపై తప్పనిసరిగా కోప్పడి ఉంటుందని మరికొందరు ఊహగానాలు చేసుకుంటున్నారు. నిజానికి వీరిద్దరూ ఆన్ స్క్రీన్ లేదా ఆఫ్ స్క్రీన్ లో చాలా ముచ్చటైన పెయిర్ అని వారు భావిస్తుంటారు వారిద్దరూ కలిసి నటించాలని కోరుకుంటూ ఉంటారు.

అయితే విజ‌య్ చేసిన వ్యాఖ్య‌లు క్యాజువ‌ల్ నేప‌థ్యంలో జ‌రిగాయ‌ని, అంత సీరియ‌స్‌గా తీసుకోవద్దని మరి కొందరు అంటున్నారు. సినిమా ప్రచారం కోసమే అలాంటి సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. రష్మికతో తన రిలేషన్ షిప్ స్టేటస్‌ను విజయ్ ఎప్పుడూ ధృవీకరించలేదు లేదా తిరస్కరించలేదని కూడా గమనించాలి. విజయ్ దేవరకొండ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాలమే చెప్పాలి. అయితే, ఒక్కటి మాత్రం నిజం, అతను ఇన్నాళ్లూ అభిమానులను అలరించే ఒక టాలెంటెడ్ స్టార్. ఖుషి తో అతడు తప్పకుండా అభిమానులను బాగా అలరిస్తాడని చాలామంది నమ్మకంతో ఉన్నారు.