గుండెలు ప‌గిలే న్యూస్‌… అప్ప‌టి వ‌ర‌కు సినిమాల‌కు ప్ర‌భాస్‌ గుడ్ బై…!

పాన్‌ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కంటిన్యూ షూటింగ్స్ కారణాంగా ప్రభాస్ మోకాలు నొప్పి బారిన పడ్డాడట. గత కొంతకాలం నుంచి తీవ్రమైన మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న ప్రభాస్ డాక్టర్ సలహా మేరకు డిసెంబర్ వరకు ‘ కల్కి 2898 ‘ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని.. ఆ తర్వాత అమెరికా వెళ్లి న్యూయార్క్‌లో ఒక పెద్ద హాస్పిటల్లో మోకాలికి సర్జరీ చేయించుకోబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సర్జరీ తర్వాత కనీసం ఏడాదిన్నర పాటు ప్రభాస్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందట. దీంతో ఈ ఏడాదిన్నర పాటు ప్రభాస్ సినిమాలకి గుడ్‌బై చెప్ప‌బోతున్నాడంటు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కల్కి 2898 మూవీ తో పాటు ప్రభాస్ మరో మూడు సినిమాలను ఒప్పుకున్నాడు. మారుతి డైరెక్షన్ లో హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ ఆ సినిమా తర్వాత దర్శకుడు సందీప్ వంగాతో స్పిరిట్ అలానే బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా లెవెల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రభాస్ అనారోగ్య రీత్యా ఈ మూడు సినిమాల షూటింగ్ ఏడాదిన్నర ఆల‌స్యం అవ‌నుంది.