చిరు నెక్స్ట్ మూవీ మూవీ కి లైన్ క్లియర్.. మరి దర్శకుడు ఎవరంటే..!?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బంపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాకు ముందు చిరంజీవి ద‌గ్గ‌ర నంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను అంతగా మెప్పించ లేకపోయినా వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి తన క్రేజ్‌ను చూపించాడు చిరు. అదే ఊపుతో మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమా చేశాడు.

తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈసినిమా తొలి ఆట నుంచే భారీ నెగటివ్ టాక్ ను తెచ్చుకొని చిరంజీవి కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమాతో మెహర్ రమేష్ మరోసారి రాడ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఆయన చేయబోయే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇప్పటికే చిరంజీవి నాగార్జునకు సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు వంటి బంపర్ హిట్ లు ఇచ్చిన కళ్యాణ్‌ కృష్ణతో ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్‌కు బింబిసారాతో బంపర్ హిట్ ఇచ్చిన యువ దర్శకుడు వశిష్టతో చిరు ఓ సోషియో ఫాంటసీ మూవీ చేయబోతున్నాడు అంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చిరు తన తర్వాత సినిమాని యంగ్ దర్శకుడు వశిష్టతతోనే చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాన్ని మేకర్స్ ఈ ఏడాది నవంబర్ నుంచి స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే మెగాస్టార్ సిసలైన సినిమా మొదలవుతుంది అని చెప్పాలి. బహుశా అంజి తర్వాత మళ్ళీ మెగాస్టార్ చేస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ఇదే అని చెప్పాలి.