కొడుకు చేసిన పనికి బిత్తరపోయిన ఎన్టీఆర్.. ఏమైందంటే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అభిమానులో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పవ అవసరం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వార్ 2తోపాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా నటించనున్నాడు. ఈ సినిమాలపై భారీ అంచనాలు ఉండగా ఎన్టీఆర్ కూడా షూటింగ్ త్వర త్వరగా పూర్తి చేస్తున్నారు.

ఈ సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇది పక్కన పెడితే తారక్ త‌న‌ సినిమాలకి ఎంత ప్రాముఖ్యత చూపిస్తాడు ఫ్యామిలీకి కూడా అంతే చూపిస్తాడని చెప్పవచ్చు. ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ తన కొడుకు చేసిన పనికి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్‌ను నాన్న కోసం పుట్టావా? అమ్మ కోసం పుట్టావా అని అడిగితే నాన్న కోసం పుట్టానని చెప్పేవాడట. ఒక రోజు నేను షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు సెట్స్ లో ఉండేవాడిని.

నా కొడుకు స్కూల్ కి వెళ్ళిపోవడంతో ఉదయం నేను ఇంటికి వెళ్లే సమయానికి లేవట్లేదని.. రాత్రి ఇంటికి వెళ్లే సమయానికి నా కొడుకు పడుకుని పోతాడంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఒకసారి నేను ఇంటి ద‌గ్గ‌ర‌ ఉన్నప్పుడు అభయ్ రామ్ నా దగ్గరకు నాన్న అనుకుంటూ వస్తే. అప్పుడు నేను నాన్న అంటే ఇష్టమా? అమ్మ అంటే ఇష్టమా? అని అడిగాను అప్పుడు అమ్మ అన్నాడని ఇది మనకు తెలియకుండా ఎలా జరిగింది అనిపించిందని కూడా ఎన్టీఆర్ కామెంట్ చేయడం ఆశ్చర్యం. పిల్లలతో ఎక్కువసేపు ఎవరు టైం గడిపితే వాళ్ళని ఎక్కువగా ఇష్టపడతారని ఎన్టీఆర్ వెల్లడించాడు.