క్యాస్టింగ్ కౌచ్ పై మొదటిసారి నోరు విప్పిన హీరోయిన్ ఆమని..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ ఆమని జంపలకడిపంబ సినిమా ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న ఆమని ఆ తర్వాత మిస్టర్ పెళ్ళాం వంటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పలు చిత్రాలకు జాతీయ ఫిలిం అవార్డు కూడా అందుకున్న ఆమని తెలుగుతోపాటు తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆమని చాలా ఎల్ల తర్వాత మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి తిరిగి రీఎంట్రీ ఇచ్చింది.

10 Homely pictures of yesteryear Telugu actress Aamani | Times of India

ఈ ఏడాది విడుదలైన వినరో భాగ్యము విష్ణు కథ, అల్లంత దూరాన వంటి చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. ఆమని కెరియర్ లోనే పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకోవడం జరిగింది ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ పైన కూడా పలు విషయాలను తెలియజేసింది.. కాస్టింగ్ కౌచ్ పై ఆమని మాట్లాడుతూ హీరోయిన్లకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయని అప్పట్లో ఎక్కువగా సోషల్ మీడియా లేదు అందుకే ఎవరికి తెలియకపోయేది అంటూ తెలిపింది.

Aamani Wiki Bio Age Husband Salary Photos Video News Ig Tw

ఏ వృత్తిలోనైనా సరే మంచి చెడులు అనేవి ఉంటాయి హీరోయిన్గా అది మనం డెసిషన్ తీసుకోవాలి తమిళ ఇండస్ట్రీలో ఒకసారి తనకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది అని తెలిపింది. ఒకసారి స్విమ్మింగ్ పూల్ చేసే సీన్ కోసం డ్రెస్ తీసి ఏమైనా స్ట్రెచ్ మార్కులు ఉన్నాయేమో చూడాలి అని కోరారట..కానీ తను మాత్రం అందుకు ఒప్పుకోలేదని అలాంటివారు కేవలం వాటి కోసమే వస్తారు నేను వెంటనే అలాంటి క్యారెక్టర్ ని చేయనని చెప్పానని తెలిపింది.

కొంతమంది అడ్వాన్స్ ఇచ్చిన సమయంలోనే ఫోన్ చేసి డైరెక్టర్ స్టొరీ గురించి మాట్లాడాలన్నారు మీరు రావాలంటే ఒక మేనేజర్ ఫోన్ చేశారట. కానీ ఈ విషయాలు తనకు చాలా రోజులకు అర్థమయిందని తెలిసింది. ఇప్పట్లో సెల్ ఫోన్లు లేవు కేవలం డైరెక్ట్గా మేనేజర్ వచ్చి మాట్లాడేవారని తెలిపింది ఆమని. అలాంటి సమయంలో మరొకరు ఫైనాన్షియల్ వస్తున్నారు మిమ్మల్ని చూడాలంటున్నారు రమ్మని చెప్పారట.. అందుకు తను డైరెక్టర్ నిర్మాత చూస్తే చాలు కదా ఇంకా ఎక్కువ అంటే హీరో చూడాలి కానీ ఫైనాన్స్ చూడడం ఏంటి అంటూ తనకు అనుమానం వచ్చిందని ఆ తర్వాత కొద్ది రోజులకు పూర్తిగా అర్థమయిందని ఒకసారి తన తల్లిని తీసుకువస్తూ ఉంటే వద్దు మీరు ఒక్కరే రమ్మని చెప్పారట దీంతో అయాం సారీ నేను రానని చెప్పేశానని తెలిపింది ఆమని.