చిరంజీవి చెల్లిగా కీర్తి అన్ని కోట్లు తీసుకుందా.. ముక్కుపిండి మ‌రీ వ‌సూలు చేసిందా..!

టాలీవుడ్‌లో కీర్తి సురేష్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో చెల్లెలు పాత్రలు నటించడానికి చాలామంది స్టార్స్ ఇష్టపడరు. సిస్టర్, ఫ్రెండ్ లాంటి పాత్రల్లో నటిస్తే వారి క్రేజ్ తగ్గుతుందేమో ఇకపై హీరోస్ తమ పక్క హీరోయిన్లుగా మమ్మల్ని చూస్ చేసుకోరేమోనని భయంతో సిస్టర్ గా నటించే అవకాశాలు వచ్చినా వాటిలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు.

కీర్తి సురేష్ మాత్రం వారందరికీ భిన్నం తనకు వచ్చిన అవకాశంలో కంటెంట్‌ తనకు ఇంపార్టెన్స్ ఉందనిపిస్తే ఎటువంటి రోల్ ను ప్లే చేయడానికి అయినా కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇలా రజినీకాంత్ హీరోగా రిలీజైన పెద్ద‌అన్నా సినిమాలో ఆమె హీరో చెల్లి పాత్రలో నటించింది. కథలో కీరోల్‌ ప్లే చేసిన ఆమె మంచి మార్కులు తెచ్చుకుంది. ప్రస్తుతం భోళా శంకర్ మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా కీర్తి కనిపించబోతుంది. దర్శకుడు మెహర్ రమేష్ రూపొందించిన ఈ సినిమా తమిళ్ హిట్ మూవీకి రీమేక్ అని తెలిసిందే.

ఇందులో చిరంజీవి చెల్లి పాత్ర కీరోల్‌ కావ‌డంతో మొదటగా ఆ పాత్ర‌కి సాయి పల్లవిని అనుకున్నారట. ఆమె రిజెక్ట్ చేయడంతో కీర్తి సురేష్‌ని తీసుకున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో చెల్లెలి రోల్‌ ప్లే చేసినా ఆమెకున్న క్రేజ్ రీత్యా రెమ్యూనరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గలేదని హీరోయిన్ రేంజ్ లో పుచ్చుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు రూ2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందట. ఒకవేళ ఇదే నిజమైతే చెల్లెలి పాత్రలో హీరో పక్కన నటించడానికి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న వారిలో మొదటి స్థానంలో కీర్తి సురేష్ ఉంటుంది.