హైపర్ ఆది చేసిన ఓవరాక్షన్ వల్లే.. భోళా శంకర్ సినిమాకు మైనస్ కాబోతోందా..?

బుల్లితెర కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో నటించే అవకాశాలు అందుకుంటున్నారు. తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడడంతో పలు వాక్యాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. హైపర్ ఆది కమెడియన్ గా సినిమా గురించి వేదిక పైన మాట్లాడాల్సింది పోయి చిరు పవన్ దృష్టిలో పెట్టుకొని ఒక గొప్ప అభిమానిగా మిగిలిపోవాలని రాజకీయాలకు తెరలేపే విధంగా మాట్లాడడంతో రాజకీయాల నాయకులను ఉద్దేశించి మాట్లాడడంతో చిక్కుల్లో పడుతున్నట్లు తెలుస్తోంది.

Bhola Shankar gave everyone a hyper Aadi on stage

ఈ వేదిక పైన హైపర్ ఆది మాట్లాడిన మాటలు మెగా అభిమానులకు కూడా కాస్త చిరాకును తెప్పించేలా కనిపించాయట. చిరంజీవి ముందు హైపర్ ఆది రాజకీయాల గురించి ఇలా మాట్లాడడంపై పలు వివాదాలకు కూడా దారి తీసేలా హైపర్ ఆది చేశారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో వైసిపి పార్టీ నాయకులు చిరంజీవి సినిమాని టార్గెట్ చేస్తూ గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు.

ఇలా చిరంజీవి సినిమా రాజకీయ వివాదంలో హైపర్ ఆది వల్లే చిక్కుకున్నారని అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా హైపర్ ఆది చేసిన అతి చేష్టల వల్ల తీవ్రమైన ప్రభావం సినిమాల పైన చూపిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై మేధా అభిమానులు హైపర్ ఆది పైన తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.. చిరంజీవి పైన ఇప్పటివరకు మంచి ఒపీనియన్ ఉన్నప్పటికీ ఇలా కొంతమంది మాట్లాడిన మాటలు వల్ల పలు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.