స్కంద ట్రైలర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్లో రామ్ పోతినేని…!!

స్టార్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం స్కంద.. ఈ సినిమాని డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.అఖండ సినిమా తర్వాత బోయపాటి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మంచి బజ్ ఏర్పడుతోంది.. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. రామ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ట్రైలర్ వస్తుందా అని ఎదురు చూశారు ఆ సమయం రానే వచ్చేసింది..

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ,సాంగ్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోక ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. ఈ చిత్రంలో రామ్ మరొకసారి మాస్ హీరోగా కనిపించబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్నటి రోజున ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్గా చేయడం జరిగింది. ఈ వేడుకకు బాలకృష్ణ అతిధిగా హాజరయ్యారు ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసిన చిత్ర బృందం బాలయ్య చేతుల మీదుగా విడుదల చేసిన ఈ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

రామ్ పోతినేని ఈ సినిమాలో మాస్ లెవెల్ లో మరొకసారి ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. ట్రైలర్ చూస్తూ ఉంటే బోయపాటి మార్క్ మరొక్కసారి కనిపించేలా కూడా కనిపిస్తోంది. డైలాగులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు రామ్ ఇంతవరకు ఏ సినిమాలో నటించని నటనతో ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ వైరల్ గా మారుతోంది.