అమ్మాయిలతో మెట్రో లేడీస్ కోచ్లోకి యువకుడు.. అసలేం జరిగిందో తెలుసా…!!

వివాదాలతో చిత్ర విచిత్రాలతో తరచూ వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రోలో తాజాగా మరో ఘటన జరిగింది. అసభ్యడ్యన్సులు ,ఫైటింగ్లు ,వైరల్ కావడానికి కొందరు చేసే పిచ్చి పనులతో ఢిల్లీ మెట్రో యాజమాన్యం కఠిన నిబంధనలు విధించింది. మెట్రో ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ… తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోమని పెచ్చరించింది.

అయినా ప్రయాణికులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు మహిళా కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. మహిళ విభాగంలోకి పురుషులకు అనుమతి ఉండదు… అయినా నియమాలను పుల్లగించి వెళ్లడంపై రైలులో ఓ యువతి ప్రశ్నించింది. యువకునికి తోడుగా వచ్చిన మరో మహిళ.. ఆ యువతిపై దురుసుగా ప్రవర్తించింది. బూతులు తిడుతూ కొట్టినంత పని చేసింది.