శృతి హాస‌న్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. రోజుకు అర‌గంట అయినా అది చెయ్యాల్సిందే అట‌!

అందాల భామ శృతి హాస‌న్ టాలీవుడ్ లో స‌క్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఆ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీర‌య్య, వీర సింహా రెడ్డి రూపంలో రెండు బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగులో రెండు సినిమాల్లో భాగ‌మైంది. అందులో `స‌లార్‌` ఒక‌టి. ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది.

ఫ‌స్ట్ పార్ట్ ను సెప్టెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌బోతున్నాడు. అలాగే మ‌రోవైపు న్యాచుర‌ల్ నాని 30వ సినిమా `హాయ్ నాన్న‌`లో శృతి కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. కోలీవుడ్ లోనూ ప‌లు ప్రాజెక్ట్ ల‌కు క‌మిట్ అయిన శృతి హాస‌న్‌.. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియోను పంచుకుంది. అందులో శృతి హాస‌న్ త‌న మ‌ల్లె తీగ‌లాంటి న‌డుముతో ఓ క‌ల‌ర్ ఫుల్ రింగ్ ను గిర‌గిరా తిప్పుతూ ద‌ర్శ‌న‌మిచ్చింది. వ‌ర్కౌట్స్ లో భాగంగా ప్ర‌తి రోజు అర‌గంట అయినా శృతి ఇలా రింగును తిప్పుతుంద‌ట‌.

ఇలా రోజు చేస్తే పెద్దగా వర్కౌట్ చేసిన ఫీలింగ్ లేకుండానే ఫిట్ గా త‌యార‌వుతార‌ని శృతి హాస‌న్ అంటోంది. అంతేకాదు, వయస్సు పెరిగినా కూడా ఇలాంటి వర్కౌట్స్ వ‌ల్ల‌ యంగ్ గా, అందంగా కనిపిస్తార‌ని.. త‌న బ్యూటీ సీక్రెట్ ఇదే అని శృతి హాస‌న్ చెప్పుకొచ్చింది. ఇక శృతి హాస‌న్ పోస్ట్ చేసిన వీడియో నెటిజ‌న్ల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. వీడియో పోస్ట్ చేసిన మూడు గంట‌ల్లో 40 వేల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. అన్న‌ట్లు శృతి హాస‌న్ గ‌త రెండేళ్ల నుంచి శాంతాను హజారికాతో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి కాకుండానే వీరిద్ద‌రూ ఒకే ఇంట్లో ఉంటూ డేటింగ్ చేస్తున్నారు. షూటింగ్స్ నుంచి ఏ మాత్రం గ్యాప్ దొరికినా శృతి ప్రియుడితో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)